
Facebook CEO Mark Zuckerberg.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్‌పై దాడుల కారణంగా తమ దేశం రష్యాపై ఆంక్షలు విధించారన్న ప్రతీకారంతో పుతిన్ అనేక దేశాల ప్రముఖులపై నిషేధం విధిస్తున్నారు.
తాజాగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్‌పై రష్యా నిషేధం విధించింది. ఆంక్షల్లో భాగంగా భాగంగా అమెరికాకు చెందిన 29 మంది రాజకీయవేత్తలు, కంపెనీ సీఈవోలను, 61 మంది కెనడియన్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. వారిపై నిరవధికంగా బ్యాన్ విధిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా ప్రకటించిన బ్లాక్‌లిస్టులో లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ, ఏబీసీ న్యూస్ టెలివిజన్ ప్రెజెంటర్ జార్జ్ స్టెఫానోపౌలోస్, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్, అమెరికా రక్షణ అధికారులలో పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మరియు డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ కాథ్లీన్ హిక్స్ ఉన్నారు. అంతకుముందు రష్యా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని ‘ఉగ్రవాద’ సంస్థలుగా పేర్కొంది.
ఇది చదవండి: పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment