మెటా ఉద్యోగులకు ఊహించని షాక్ తగలనుంది. ఆ సంస్థ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఉదయం నుంచి కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. ఈ సందర్భంగా కంపెనీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని మెటా ఖండించింది.
87,000 కంటే ఎక్కువ మంది విధుల నిర్వహిస్తున్న మెటాలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అయితే తాజా సమావేశంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని జూకర్ బర్గ్ చెప్పారు. కానీ ఎంత మందికి పింక్ స్లిప్ ఇచ్చే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇక వేటు వేసే ఉద్యోగుల్లో రిక్రూటింగ్, బిజినెస్ టీం గ్రూప్ సభ్యులున్నారని సమాచారం.
ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్‌ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కారణాలివేనా
ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానంగా ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్‌మెంట్‌లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, టిక్‌టాక్ నుండి పోటీ, యాపిల్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం, వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు మెటాలో ఉద్యోగుల‍్ని తొలగింపు కారణమైంది.
చదవండి👉 : 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment