వేగంగా డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైమ్ దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కాపాడుకోలేకపోవచ్చు' అని నిరూపిస్తుంది ఫేస్‌బుక్ (మెటా) ఉదంతం.
ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారి..ఫేస్‌బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జుకర్‌బర్గ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకొని జుకర్ సంపాదించిన సంపద అంతా.. ఇప్పుడు ఆయా కేసులు నుంచి తప్పించుకునేందుకు ఖర్చు చేస్తున్నారు. పైగా ఫేస్‌బుక్ పేరు మెటా గా మార్చి లక్షల కోట్ల నష్టాల్ని చవిచూశారు. ఇప్పుడు అదే ఫేస్‌బుక్‌కు చెందిన జిఫైని అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. కాదు కూడదు అంటే జుకర్‌పై మరిన్ని చర్యలు తీసుకునేందుకు యూకే ప్రభుత్వం సిద్ధమైంది.
జుకర్ ఏడాదిన్నర క్రితం యూకేకి చెందిన జిఫై (Graphics Interchange Format) మేకింగ్, షేరింగ్ సంస్థను కొనుగోలు చేశారు. ఆ సంస్థను ఫేస్‌బుక్ అమ్మేయాలని యూకేకి చెందిన రెగ్యులేటరీ సంస్థ సీఎంఏ (Competition and Markets Authoirty) జుకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కానీ అందుకు జుకర్ ఒప్పుకోలేదు. దీంతో బ్రిటన్ రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై సుమారు 50.5 మిలియన్ జీబీపీ (బ్రిటిష్ పౌండ్లు) (సుమారు రూ. 520 కోట్లు) జరిమానా విధించింది. ఇప్పుడు ఇదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జిఫైని అమ్మాలని హెచ్చరించింది. ఒకవేళ్ల జుకర్ కాదంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఎంఏ సిద్ధమైంది.
జిఫై అమ్మితే ఎవరికి లాభం
ఒకవేళ జుకర్‌బర్గ్ జిఫైని అమ్మేస్తే ఫేస్‌బుక్ ఆధిపత్యాన్ని నిరోధించవచ్చని ప్లాన్ వేసింది. సీఎంఏ ప్రకారం జిఫైని ఫేస్‌బుక్ అమ్మేస్తే ఆ సోషల్ ప్లాట్ ఫాం నుంచి ఇతర ప్లాట్‌ఫామ్‌లను చేసే యాక్సెస్‌ను ఫేస్‌బుక్‌కు పరిమితం చేయొచ్చని తెలుస్తోంది. అంతేకాదు జిఫై అమ్మితే యూకేలోని $9.4 బిలియన్ల డిస్‌ప్లే యాడ్ మార్కెట్‌ను ప్రభావం చూపుతుందోనని ఫేస్‌బుక్ భావిస్తుందని సీఎంఏ పేర్కొంది.
చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
Comments
Please login to add a commentAdd a comment