‘అమెరికా ఇండిపెండెన్స్‌ డే’..మార్క్‌ జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలు | Mark Zuckerberg celebrates america independence day an eye catching way this year | Sakshi
Sakshi News home page

‘అమెరికా ఇండిపెండెన్స్‌ డే’..మార్క్‌ జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలు

Jul 5 2024 11:17 AM | Updated on Jul 5 2024 12:36 PM

Mark Zuckerberg celebrates america independence day an eye catching way this year

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

జులై 4న అమెరికా ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఒక చేతిలో బీర్‌ బాటిల్‌, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్‌(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్‌ బ్లాక్‌ యాప్రాన్‌, వైట్‌ షర్ట్‌ ధరించారు. కళ్లకు బ్లాక్‌ గాగుల్స్‌ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే అమెరికా’ అని రాశారు.

జుకర్‌బర్గ్‌ ఆరు నెలల కిందట మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్‌ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్‌ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement