Sheryl Sandberg Leaves Meta: సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) కు సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్‌బర్గ్ గుడ్ బై చెప్పారు. ఆ సంస్థలో 14 ఏళ్లుగా వివిధ ఉన్నత స్థాయి విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఆమె తాజాగా మెటాను వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) కు సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్‌బర్గ్ గుడ్ బై చెప్పారు. ఆ సంస్థలో 14 ఏళ్లుగా వివిధ ఉన్నత స్థాయి విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఆమె తాజాగా మెటాను వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
14ఏళ్ల పాటు పనిచేసి మెటాను వదిలి వెళుతున్నట్లు చేసిన షెరిల్ శాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో ఆ సంస్థ షేర్లు 4శాతం నష్టపోయాయి. ఇక షెరిల్ నిర్ణయంపై జుకర్ బర్గ్ స్పందించారు.
" మెటాలో ఓ శకం ముగిసింది. 14ఏళ్ల తర్వాత నా స్నేహితురాలు, వ్యాపార భాగస్వామి షెరిల్ శాండ్ బర్గ్ మెటా సీఓఓ పదవికి రాజీనామా చేశారు. 2008లో షెరిల్ మెటాలో జాయిన్ అయినప్పుడు నా వయస్సు 23ఏళ్లు. వ్యాపారం వైపు అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నా. మేం మంచి ప్రొడక్ట్‌ను (ఫేస్‌బుక్) తయారు చేశాం. కానీ ఆ ప్రొడక్ట్‌ను ఎలా లాభాలొచ్చే వ్యాపారంగా తీర్చిదిద్దాలి. చిన్న స్టార్టప్‌ను ప్రపంచంలో అతి పెద్ద సంస్థగా ఎలా తీర్చిదిద్దాలి' అనే విషయాలపై అవగాహన లేదు. చుక్కాని లేని నావలా ఉన్న మెటాను షెరిల్ ఆదుకున్నారు.
ఫేస్‌బుక్‌లో యాడ్స్ ఆధారిత బిజినెస్ మోడల్‌ను వెలుగులోకి తెచ్చారు. సంస్థను పటిష్టం చేసేందుకు ఉపయోగ పడే అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని జల్లెడ పట్టి మరి నియమించుకున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న మేనేజ్మెంట్ కల్చర్‌ను మార్చారు. తన ఆలోచనలతో స్టార్టప్‌ను ఒక సంస్థగా మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించారు. ఈరోజు మెటా ఈ స్థాయిలో ఉందంటే అందుకు ఆమె కారణమని జుకర్ బర్గ్ కొనియాడారు. సంస్థలో రాజీనామా చేసినా షెరిల్‌తో మా వ్యాపారం సంబంధాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఆమెది గొప్ప వ్యక్తుత్వం, సహచరురాలు అంతకు మించి మంచి స్నేహితురాలంటూ " ప్రశంసల వర్షం కురిపించారు.
చదవండి👉హే..! జుకరూ..నువ్వు మారవా?
Comments
Please login to add a commentAdd a comment