సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. వీటి వాడకాన్నిపూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ క్రిప్టో కరెన్సీల వాడకాన్ని ప్రస్తావించారు. వీటిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
చెల్లింపు వ్యవస్థల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీని పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. మరోవైపు బిట్‌కాయిన్స్ పట్ల మదుపుదారులు అప్రమత్తంగా ఉండాలని, వీటి ఒడిదుడుకులకు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవాలని ఆర్‌బీఐ ఇప్పటికే హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment