స్టాక్ మార్కెట్‌లు కొన్ని రోజుల క్రితం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. దాంతో చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌లు భారీగా పెరిగాయనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో కొన్నికారణాల వల్ల కొద్దికాలంగా మార్కెట్‌లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. తాజాగా మార్కెట్ తీరుతెన్నులపై సెబీ నిర్వహించిన సదస్సులో బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ మాట్లాడారు.
భారత స్టాక్ మార్కెట్లు గాలి బుడగలా లేవని ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో షేర్ల విలువలపై నియంత్రణ సంస్థలతో పాటు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షేర్ల విలువలు కొంత అధిక స్థాయుల్లోనే ఉన్నప్పటికీ.. చేయిదాటి పోలేదని కోటక్ అన్నారు.
ఇదీ చదవండి: ఏఐ ప్రభావం.. ఉద్యోగాలు పోతాయ్..? ఇప్పుడేం చేయాలంటే..
మార్కెట్లలో గాలి బుడగ ఏర్పడితే, దాన్ని పెరగకుండా చూసుకోవాలని, లేదంటే అది పేలి మదుపర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది మంచిది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లలో ఎప్పటికప్పుడు ముప్పులను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయని నమ్ముతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment