ముంబై: కార్పొరేట్ పెట్టుబడులు మరింతగా విస్తరించవలసి ఉన్నట్లు వెటరన్ బ్యాంకర్ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. కొన్ని గ్రూపులు మాత్రమే పెట్టుబడులు చేపడుతున్నాయని, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే సదస్సులో ప్రసంగిస్తూ ఇందుకు విధానాలు మార్చవలసిన అవసరంలేదన్నారు.
భారీ కార్పొరేషన్లు ప్రపంచస్థాయి బిజినెస్‌లను సృష్టిస్తున్నట్లు ప్రశంసించారు. ప్రధానంగా ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే కొన్ని ప్రధాన గ్రూప్‌ల నుంచి మాత్రమే కొత్త పెట్టుబడులు నమోదవుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇందుకు విధానాలను సవరించవలసిన అవసరంలేదని పేర్కొంటూ, మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించవలసి ఉన్నదని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment