అమెరికన్ డాలర్ ‘ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది’ అని చేసిన వ్యాఖ్యపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ మాట తాను అనుకోకుండా అన్నానన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘యూఎస్ డాలర్‌పై ఇటీవల జరిగిన చర్చలో నేను అనుకోకుండా "ఆర్థిక ఉగ్రవాది" అనే పదాలను ఉపయోగించాను. నా ఉద్దేశం ఏమిటంటే రిజర్వ్ కరెన్సీకి అసమాన శక్తి ఉంటుంది. అది నోస్ట్రో ఖాతా అయినా కావచ్చు. 500 బీపీఎస్ రేటు పెరుగుదల అయినా లేదా లిక్విడిటీ కోసం యూఎస్ డాలర్‌ను కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలైనా కావచ్చు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు..
రిజర్వ్ డాలర్‌గా ఉన్న అమెరికన్ డాలర్ హోదా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుందన్నారు. చరిత్రలో కీలకమైన ఈ తరుణంలో ప్రపంచం కొత్త రిజర్వ్ కరెన్సీ కోసం వెతుకుతోందని తాను భావిస్తున్నట్లు కోటక్ ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. యూరప్, బ్రిటన్, జపాన్, చైనాతో సహా ఇతర దేశాలు తమ కరెన్సీలను రిజర్వ్ కరెన్సీలుగా పేర్కొనడానికి ముందస్తు అవసరాలు లేవని ఆయన అన్నారు. రూపాయి రిజర్వ్ కరెన్సీ కావాలంటే దేశం బలమైన సంస్థలను, వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.
గత మార్చి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం రూ. 3,495.6 కోట్ల వద్ద 26.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి రూ.6,102.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు నాల్గవ త్రైమాసికంలో రూ.1,193.30 కోట్లకు తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,736.71 కోట్లు. శాతాల పరంగా, నికర ఎన్‌పీఏ నికర అడ్వాన్స్‌లలో 0.64 శాతం నుంచి 0.37 శాతానికి మెరుగుపడింది.
ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్‌లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment