సాధారణ ఎగువ మధ్యతరగతి కుంటుంబ నేపథ్యంనుంచి వచ్చి బ్యాంకింగ్ నేపథ్యం ఏమీ లేకుండానే దేశీయంగా టాప్ బ్యాంకర్‌గా ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. క్రికెట్‌లో రాణించాలనుకుని, తొలుత కుటుంబ వ్యాపారం, తదుపరి బ్యాంకింగ్ రంగంలోjకి ఎంట్రీ ఇచ్చి, ఎదురులేని లీడర్‌గా దూసుకుపోతూ ఒంటిచేత్తో కోటక్‌మహీంద్ర బ్యాంకును విజయ తీరాలకు నడిపించడమే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచిన బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి తెలుసుకుందాం...!
ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితా ప్రకారం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్. దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ఇండెక్స్ ప్రకారం, అతని నికర విలువ 14.8 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు).
ఉదయ్ కోటక్ విజయ ప్రస్థానం
1959, మార్చి 15న పత్తి పరిశ్రమలో ఉన్న ఎగువ మధ్య తరగతికి చెందిన గుజరాతీ కుటుంబానికి చెందినవారు ఉదయ్ కోట్.ముంబైలోని సిడెన్‌హామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీజీ చేశారు. టాప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతో ఫ్యామిలీ వ్యాపారంలో ప్రవేశించారు. రీజినబుల్ రేట్లలో చిన్న చిన్న రుణాలివ్వడం ప్రారంభించారు.
దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో 1985లో ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒకవైపు లోన్లపై అధిక వడ్డీరేట్లు, మరోవైపు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక విప్లవానికి బీజం పడింది. అతిస్వల్ప కాలంలోనే కేంద్ర బ్యాంకు ఆర్బీఐ నుంచి పూర్తి బ్యాంకింగ్ లైసెన్స్‌ని అందుకున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీగా అవతరించింది. ఆ తరువాత,బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 22 మార్చి 2003 న, భారత కార్పొరేట్ చరిత్రలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి సంస్థగా అవతరించింది. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?)
క్రికెటర్ అయ్యేవాడిని
భారతదేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ పురోగతికి ఉదయ్‌కోటక్ కృషి అమోఘం. తాను వ్యాపారవేత్తను కాకపోయి ఉండి ఉంటే క్రికెట్ ప్లేయర్‌గా ఉండేవాడిని అంటూ క్రికెట్‌పై తన ప్రేమను అనేక ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు కోటక్ అలాగే గణితంలో మాంచి ప్రావీణ్యమున్న ఉదయ్ కోటక్ చిన్నతనంలో సితార్ వాయించేవారట. పెద్ద ఉమ్మడి కుటుంబంలో 60 మందితో ఉన్న ఇంట్లో సోషలిజాన్ని, పనిలో పెట్టుబడిదారీ విధానాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ఆయన సతీమణి పేరు పల్లవి కోటక్. కుమారుడు జే కోటక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బ్యాంకు, నియోబ్యాంక్ ప్లాట్‌ఫారమ్ 811కి కో-హెడ్‌గా కూడా పనిచేస్తున్నారు చిన్న కుమారుడు ధావల్ గత ఏడాది కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?)
నివేదికల ప్రకారం ఉదయ్ కోటక్ వార్షిక వేతనం 3.24 కోట్లు జీతం. అయితే కోవిడ్ కారణంగా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కోటక్ వార్షిక వేతనం రూ.2.65 కోట్లకు పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తెలిపింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం 31శాతం ఎగిసి 27.9 బిలియన్ రూపాయలకు (337 మిలియన్ల డాలర్లు) చేరింది.
కొత్త సీఈవో కోసం వేట, రేసులో కుమారుడు
మరోవైపు ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం భారతీయ వ్యాపార అధిపతుల పదవీకాలాన్ని పరిమితం చేసిన తర్వాత, వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంకు సీఈవో పదవి నుండి వైదొలగాలని భావిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త శోధనకు గాను కన్సల్టింగ్ సంస్థ ఎగాన్ జెహెండర్‌ను నిమగ్నమైందని తెలుస్తోంది. గ్రూప్ ప్రెసిడెంట్‌లు, హోల్ టైమ్ డైరెక్టర్‌లు శాంతి ఏకాంబరం, కెవిఎస్ మణియన్‌తోపాటు, వారసుడు జేకోటక్ కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment