డబ్బు విషయంలో దేశ ప్రజల ధోరణి మారింది : ఉదయ్‌ కొటక్‌ | India Transforming From Nation Of Savers To Investors | Sakshi
Sakshi News home page

డబ్బు విషయంలో దేశ ప్రజల ధోరణి మారింది : ఉదయ్‌ కొటక్‌

Published Sat, Dec 30 2023 7:38 AM | Last Updated on Sat, Dec 30 2023 7:43 AM

India Transforming From Nation Of Savers To Investors - Sakshi

న్యూఢిల్లీ: పొదుపరుల నుంచి మదుపుదారుల దేశంగా భారత్‌ రూపాంతరం చెందిందని ప్రముఖ బ్యాంకరు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మాజీ ఎండీ ఉదయ్‌ కోటక్‌ తెలిపారు. నేడు చాలా మంది తమ మిగులు నిధులను మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. 

1980ల తొలినాళ్లలో బంగారం, స్థలంతో పోలిస్తే ఆర్థిక అసెట్స్‌పై భరోసా తక్కువగా ఉండేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రజలు కొంత భాగాన్ని బ్యాంకు డిపాజిట్లు, ఎల్‌ఐసీ, యూటీఐ వంటి వాటిల్లోకి మళ్లించడం మొదలుపెట్టారని పేర్కొన్నారు.

 ‘90లలో కూడా ఈక్విటీల్లో పెట్టుబడులంటే ’స్పెక్యులేటివ్‌’గానే చూసేవారు. దీంతో మన కంపెనీలు నిధుల కోసం విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌ఐఐ) ఆశ్రయించాల్సి వచ్చేంది. వాటి సామర్థ్యాలను గుర్తించిన ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్‌ చేశారు కానీ దేశీ పొదుపరులు మాత్రం దూరంగానే ఉండేవారు‘ అని తెలిపారు.

‘మాలో కొందరు ఇలాంటి ధోరణులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టికి తీసుకెళ్లాం. ఇది 2000 తొలినాళ్లలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ మార్కెట్‌ (క్యూఐపీ) ప్రారంభానికి దారితీసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement