న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది (2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24% జంప్‌చేసి రూ. 4,423 కోట్లను తాకింది. వడ్డీ ఆదా యం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.
స్టాండెలోన్ లాభం సైతం రూ. 2,581 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% వృద్ధితో రూ. 6,297 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 5.22 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 1,832 కోట్ల నుంచి రూ. 2,314 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.08% నుంచి రూ. 1.72%కి తగ్గాయి.
అశోక్ వాశ్వానికి సై: కొటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా బయటి వ్యక్తి అశోక్ వాస్వాని ఎంపికకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ నాలుగు నెలల ముందుగానే ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో అశోక్‌ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment