ముంబై: అదానీ గ్రూపు కంపెనీల్లో కోటక్ మహీంద్రా బ్యాంకుకు సైతం కొంత ఎక్స్‌పోజ ర్ (పెట్టుబడులు/రుణాలు) ఉన్నట్టు బ్యాంక్ అంగీకరించింది. అయితే, ఇది తమ క్రెడిట్ సూత్రాలకు లోబడే ఉన్నట్టు హోల్‌సేల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ పరితోష్ కాశ్యప్ తెలిపారు. ‘‘అదానీ గ్రూపు చుట్టూ ఉన్న అంశాలు అన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్, మార్కెట్ విలువలకు సంబంధించినవి. రుణ పరపతి గురించి కాదు. మాకు స్వల్ప ఎక్స్‌పోజర్ ఉంది. దేశంలోని ప్రతి కార్పొరేట్‌తో మాకు వ్యాపారం ఉంటుంది.
కాకపోతే ఇది మా క్రెడిట్ సూత్రాలకు లోబడే ఉంది’’అని చెప్పారు. అదానీ గ్రూప్ కంపెనీలకు రుణ భారం సహేతుక స్థాయిలో ఉందన్నారు. అలాగే, బలమైన లాభదాయకత, బ్యాలన్స్ షీట్లను కలిగి ఉన్నట్టు చెప్పారు. అమె రికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ.. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు ఉన్నా యని, కంపెనీల షేర్లను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపణలు చేయడం తెలిసిందే. దీన్ని అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ.. కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సెబీ దర్యాప్తునకు కూడా ఆదేశించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment