Exposure
-
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్‌కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు. -
స్కిల్ కుంభకోణం వివరాలు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను, దర్యాప్తు చేస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంటూ భౌతిక దాడులకు, తీవ్ర ఆరోపణలకు దిగిన తెలుగుదేశం పార్టీ వర్గాలు... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట రాకుండా న్యాయస్థానాల్లో గట్టిగా వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని, సీఐడీ చీఫ్ సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో భాగంగా స్కిల్ కుంభకోణం గురించిన వాస్తవాలను పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎన్.సంజయ్‌లపై ఆ వర్గాలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాయి. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పత్రికా సమావేశాలు పెట్టడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వారిద్దరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేకాక సుధాకర్‌రెడ్డి, సంజయ్ నిర్వహించిన సమావేశంపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. సమావేశాలు పెడుతూ, హోటళ్లలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సత్యనారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వెంట్ రూల్స్‌కు విరుద్దంగా వీరు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి సమావేశాలు పెట్టి బహిర్గతం చేయడం నైతిక విలువలకు విరుద్ధమన్నారు. చంద్రబాబుతో పాటు ఇతర నిందితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ, స్టేట్మెంట్లు ఇస్తున్నారని వివరించారు. స్కిల్ కేసులో నిర్వహించిన సమావేశాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సుధాకర్‌రెడ్డి, సంజయ్ నుంచి వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సత్యనారాయణ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
అదానీ కంపెనీల్లో కోటక్ బ్యాంక్ ఎక్స్పోజర్
ముంబై: అదానీ గ్రూపు కంపెనీల్లో కోటక్ మహీంద్రా బ్యాంకుకు సైతం కొంత ఎక్స్పోజ ర్ (పెట్టుబడులు/రుణాలు) ఉన్నట్టు బ్యాంక్ అంగీకరించింది. అయితే, ఇది తమ క్రెడిట్ సూత్రాలకు లోబడే ఉన్నట్టు హోల్‌సేల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ పరితోష్ కాశ్యప్ తెలిపారు. ‘‘అదానీ గ్రూపు చుట్టూ ఉన్న అంశాలు అన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్, మార్కెట్ విలువలకు సంబంధించినవి. రుణ పరపతి గురించి కాదు. మాకు స్వల్ప ఎక్స్పోజర్ ఉంది. దేశంలోని ప్రతి కార్పొరేట్‌తో మాకు వ్యాపారం ఉంటుంది. కాకపోతే ఇది మా క్రెడిట్ సూత్రాలకు లోబడే ఉంది’’అని చెప్పారు. అదానీ గ్రూప్ కంపెనీలకు రుణ భారం సహేతుక స్థాయిలో ఉందన్నారు. అలాగే, బలమైన లాభదాయకత, బ్యాలన్స్ షీట్లను కలిగి ఉన్నట్టు చెప్పారు. అమె రికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ.. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు ఉన్నా యని, కంపెనీల షేర్లను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపణలు చేయడం తెలిసిందే. దీన్ని అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ.. కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సెబీ దర్యాప్తునకు కూడా ఆదేశించడం గమనార్హం. -
అదానీ కంపెనీల్లో బీమా సంస్థలకు ఎక్స్పోజర్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల్లో ప్రభుత్వరంగ ఐదు సాధారణ బీమా సంస్థలకు రూ.347 కోట్ల ఎక్స్పోజర్ (రుణాలు, పెట్టుబడులు) ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల వివరాలపై సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైంది. బ్యాంకులు సమర్పించిన రుణాల సమాచారాన్ని వెల్లడించరాదని ఆర్బీఐ చట్టం చెబుతున్నట్టు సహాయ మంత్రి తెలిపారు. ఎల్ఐసీ జనవరి 30 నాటికి అదానీ గ్రూపు కంపెనీల్లో ఈక్విటీ వాటాలు, డెట్ కలిపి రూ.35,917 కోట్ల ఎక్స్పోజర్ కలిగి ఉందని, సంస్థ మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.41.66 లక్షల కోట్లలో ఇది కేవలం 0.975 శాతానికి సమానమని పేర్కొన్నారు. న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు అదానీ గ్రూపు కంపెనీల్లో జనవరి చివరికి రూ.347.64 కోట్ల ఎక్స్పోజర్ ఉంది. -
చైతన్యం.. నవ్యపథం
సిరిసిల్ల: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో కీలకమైనవి. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును స్వేచ్ఛగా.. నిర్భయంగా వినియోగించుకునే సమయం ఇది. తెలంగాణలో ముందస్తుగా జరుగుతున్న ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఓటర్లలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యాన్ని కలిగించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాల్లో ఓటు చైతన్యంపై ప్రచార పోస్టర్లు వేస్తున్నారు. ఓటును అమ్ముకోవద్దని కోరుతూ ఎన్నికల్లో అక్రమాలపై సమాచారం అందించేందుకు పౌరులకు అందించిన ఆయుధం సీ విజల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పక్రియలో ఎన్నడూ లేని విధంగా నవ్యపథంలో ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలోపాటు, వేములవాడ, అన్నిమండల కేంద్రాల్లోనూ ఓట్లపై ప్రజా చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికల తేదీని మరిచిపోకుండా ఉండేందుకు ఈనెల 7న ఎన్నికలు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ జిల్లా యంత్రాంగం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. -
నిందితుడు
‘‘మిస్టర్ రాకీ! యూ ఆర్ అండర్ అరెస్ట్’’ అన్నాడు ఇన్స్పెక్టర్. బైట నుండి కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. కిటికీ తెరిచి చూశా. మహిళాలోకం సునామీలా నా ఇంటి మీద పడింది. అప్పటికప్పుడే ఇంతమంది ఇక్కడికి ఎలా చేరుకున్నారో ఆశ్చర్యమే నాకు. ‘భార్యా హంతకుణ్ని ఉరికంబం ఎక్కించాలి. ఆ దుర్మార్గుణ్ని మాకు అప్పగించాలి.’కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజును చూసి బైటకు వస్తుంటే, ‘‘ఎక్స్క్యూజ్ మీ!’’ అన్న కోమలస్వరం వినిపించి వెనుదిరిగి చూశా. ఎదురుగా ఓ అందమైన యువతి. ‘‘నా పేరు సానియా. అబ్దుల్లా గారి భార్యను’’ అంటూ పరిచయం చేసుకుంది. అబ్దుల్లా ఎవరో చటుక్కున గుర్తుకురాలేదు నాకు. ‘‘వారం క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఉగ్రవాదుల బాంబ్ బ్లాస్టుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి చేర్చారు మీరు. అతను నాభర్త అబ్దుల్లా’’ అంటూ తన సెల్ఫోన్లో అతని ఫొటోని చూపించిందామె.గుర్తుపట్టి, ‘‘ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన?’’ అనడిగా. ‘‘ఇంకా కోమాలోంచి కోలుకోలేదు’’ అంటుంటే, ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచాయి.‘‘ఆయన తప్పకుండా కోలుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి.’’ ‘‘నా భర్తను కాపాడిన వ్యక్తి మీరేనంటూ ఆసుపత్రి సిబ్బంది మిమ్మల్ని చూపించారు’’ అందామె. ‘‘మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియడంలేదు’’.‘‘ఆ పరిస్థితుల్లో ఎవరైనా అదే పని చేసేవారు’’ అన్నాను.సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తున్నా. సుమారు పాతిక సినిమాలకు స్టంట్ డైరెక్షన్ చేశా. ప్రస్తుతం నేను ఫైట్స్ కంపోజ్ చేస్తున్న సినిమా క్లైమాక్స్ సీన్స్‌ని ఔట్‌డోర్‌లో తీయాలని లొకేషన్ సెర్చ్‌కి అసిస్టెంట్డైరెక్టర్ వెంకట్రాజుతో కలసి సిటీ బైట వివిధ ప్రదేశాలను సందర్శించి తిరిగి వస్తుండగా జరిగింది బాంబ్ బ్లాస్ట్. పేలుళ్ళకు కాస్త దూరంగా ఉండడంవల్ల మా కారుకు డ్యామేజ్ పెద్దగా జరగలేదు. గాజుపెంకులో, ఇనుపముక్కలో లోపలికి చొచ్చుకుపోవడంతో నా ఎడమ భుజానికి తీవ్రమైన గాయమై రక్తం ధారలు కట్టింది. వెంకట్రాజు ట్రౌమాకి గురయ్యాడు. ఎందరో ప్రాణాలు కోల్పోతే, మరెందరో గాయపడ్డారు. మాకు చేరువలో మధ్య వయస్కుడొకడు తీవ్రంగా గాయపడి, ‘దాహం.. దాహం..’ అంటూ అరుస్తున్నాడు. ఒకరినొకరు పట్టించుకునే స్థితిలో లేరు. ఆంబులెన్సులు రావడానికి సమయం పడుతుంది. ఆ లోపున అతను చనిపోయేలా ఉన్నాడు. నా గాయాన్ని లెక్కచేయకుండా వెంటనే అతన్ని చేతుల్తో ఎత్తుకుని కారులోకి చేర్చాను. వెంకట్రాజును లాక్కెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టాను. ఒంటి చేత్తోనే డ్రైవ్ చేసుకుంటూ సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాను. ఆ వ్యక్తిని డాక్టర్స్‌కి అప్పగించి, రక్తస్రావం అధికం కావడంతో కుప్పకూలిపోయాను. అర్ధరాత్రి వేళ తెలివిలోకి వచ్చాక ఆ వ్యక్తి గురించి అడిగితే, అతనికి ప్రాథమిక చికిత్స చేసి కేర్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. తెల్లవారాక వెంకట్రాజు, నేను కూడా కేర్ ఆసుపత్రికి షిఫ్ట్ అయిపోయాము. రెండు రోజుల తరువాత భుజానికి బ్యాండేజ్, చేతికి స్లింగ్‌తో ఆసుపత్రి నుండి నేను బైటపడితే, ఇంకా ట్రౌమా నుంచి కోలుకోని వెంకట్రాజు ఆసుపత్రిలోనే కొనసాగుతున్నాడు. నేను రోజూ వచ్చి అతన్ని చూసి వెళ్తున్నాను. సానియా కూడా రోజూ రెండుపూటలా భర్తకోసం వస్తుండేది. దాంతో మేము రోజూ పలకరించుకోవడము, మా పరిచయం పెరగడమూ జరిగాయి. ఓసారి ఐసీయూలో ఉన్న అబ్దుల్లాని చూసి వచ్చాను. ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఇంచు మించు నలభై ఐదేళ్ళుంటాయి అతనికి. ముఖంలో కఠినత్వం. అబ్దుల్లా హైటెక్ సిటీలో ఉన్న ఓ త్రీ స్టార్ హోటల్‌కు ఓనర్. నేను వెంటనే విస్తుపోయా. అదే హోటల్లో నా భార్య అమల రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. కోటీశ్వరుడైన వ్యక్తికి భార్య అయివుండీ సానియా సామాన్యురాలిలా స్కూల్లో టీచర్‌గా పని చేస్తోందని విని ఆశ్చర్యపోతుంటే, ‘‘చిన్నప్పట్నుంచీ టీచింగంటే ఇష్టం నాకు’’ అని నవ్విందామె. వెంకట్రాజును డిశ్చార్జ్ చేసిన రోజున–అవసరమైతే ఫోన్ చేయడానికి సంశయించవద్దని చెప్పి, సానియాకు నా ఫోన్ నంబర్ ఇచ్చా. సీసీ కెమెరాల ఆధారంగా బ్లాస్టులకు కారకులైన ముగ్గురు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు పోలీసులు. వారికోసం ముమ్మరంగా గాలింపు మొదలయింది. ఓ రోజున సానియా ఫోన్ చేసింది. తనను కలుసుకోవడానికి వీలవుతుందా అని. ఆమె స్వరంలో మునుపటి ఉత్సాహం కనిపించలేదు. వెళ్లి కలిశా. ఆమె వదనంలో విషాదం తాండవిస్తోంది. ‘‘హౌ ఈజ్ హీ?’’ అనడిగా. ఆమె చెప్పిన సమాధానం నన్ను ఖంగు తినిపించింది. రెండు వారాల క్రితం అబ్దుల్లా కోమాలోంచి బైటపడకుండానే చనిపోయాడట!‘‘అయామ్ వెరీ సారీ!’’ సంతాపం వెలిబుచ్చాను. ‘‘నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి మీకంటే మంచి మిత్రులు ఎవరూ కనిపించడంలేదు నాకు. వీలైతే ఓసారి మా ఇంటికి రాగలరా?’’. రెండు రోజుల తరువాత ఆమె ఇంటికి లంచ్‌కి వెళ్ళాను. పెద్ద భవంతి అది. అంగుళం అంగుళానా ఐశ్వర్యం ఉట్టిపడుతోంది. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాము. ఆమె నాతో పంచుకోవాలనుకుంటున్న వ్యక్తిగత విషయాలు ఏమిటా అని కుతూహలంగా ఉంది. కాసేపటికి ఏదో ఫైల్ తీసుకువచ్చింది. అందులోంచి మూడు ఫొటోలు తీసి నాకు చూపించింది. ఆమె భర్త అబ్దుల్లా ఎవరో వ్యక్తులతో కలసి తీయించుకున్నవి అవి. ‘‘వీటిలో నా భర్త పక్కనున్న వ్యక్తులను సరిగా చూడండి’’ అందామె.రెండింటిలో ఇద్దరు వ్యక్తులతోను, ఒకదానిలో ఓ వ్యక్తితోను ఉన్నాడు అబ్దుల్లా. ఆ వ్యక్తులను పరిశీలనగా చూశా. వారిని ఎక్కడో చూసినట్టనిపిస్తోంది. హైదరాబాద్ బ్లాస్టు కేసుల్లో పోలీసులు వెదుకుతున్న అనుమానిత వ్యక్తులు వాళ్ళు! ‘‘నా భర్త మరణం తరువాత ఆయన పర్సనల్ క్యాబినెట్ని తెరచి చూస్తే ఇతర పత్రాలతో పాటు ఈ ఫొటోలు కనిపించాయి’’ అంటూ ఆమె వివరంగా చెప్పుకుపోయింది –‘‘అబ్దుల్లా స్కూల్ డ్రాపౌట్. పెళ్ళికి ముందు ఓ టీ కొట్టు ఉండేది అతనికి. గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఐదేళ్ళ తరువాత తిరిగొచ్చాడు. రాగానే ఓ చిన్న సైజు హోటల్ ప్రారంభించాడు. ఏడాది తిరక్కుండానే అది త్రీ–స్టార్ హోటల్‌గా రూపొందింది. గల్ఫ్‌కు వెళ్ళి బాగా సంపాదించాడనుకున్నారు అంతా. బంధువుల ప్రోద్బలంతో సానియాకి అతనితో నిఖా జరిగింది. ఐతే ఇప్పుడు బైటపడ్డ పత్రాలను పరిశీలిస్తే అతను హవాలా రాకెట్ నడిపేవాడన్న నిజం బైటపడింది. ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నాయనీ, పరోక్షంగా వారికి సాయపడుతున్నాడని తెల్లమవుతోంది’’.ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అతని అక్రమాస్తుల పత్రాలు, బినామీల పేర్లు, ఫొటోలు చూపించింది. వాటిని తిరగేస్తూ ఉలిక్కిపడ్డా. అందులో ఆ యువతి ఫొటో, పేరు, వయసు, చిరునామా ఉన్నాయి. ‘‘హోటల్ ముసుగులో నా భర్త దేశద్రోహ కృత్యాలకు పాల్పడేవాడన్న ఊహే నాకు మింగుడు పడడంలేదు. బ్లాస్ట్ జరిగిన రోజున ఆయన ఉగ్రవాదులతో కలసి అక్కడికి వెళ్ళుంటాడని అర్థమవుతోంది. ఐతే వాళ్ళు అక్కడ బ్లాస్టులు జరుపుతారని ఎరిగివుండడు’’. ఆమెతో అంగీకరించాను. ఓ క్షణం ఆగి నెమ్మదిగా అందామె, ‘‘అబ్దుల్లా ఇక లేడు. పోయిన మనిషిని ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టంలేదు. అందుకే ఏం చేయాలో తోచక ఈ రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ముందుగా ఆ యువతి ఎవరో, నా భర్తకు ఆమెతో గల సంబంధం ఏమిటో? ఆమెకు కూడా ఆ హవాలా రాకెట్‌తో గాని, ఉగ్రవాదులతో గాని సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి’’.ఆ యువతి నా భార్య అమల. ఆమె అబ్దుల్లా హోటల్లో రిసెప్షనిస్టు. అబ్దుల్లా ఆమె బాస్. ఆ విషయం నేను తనతో చెప్పలేదు. సానియా దగ్గర సెలవు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చా. ఆ సమయంలో అమల హోటల్లో ఉంటుంది. అమల బీరువా వెదికాను. అడుగున ఉన్న సీక్రెట్ అరలోంచి పత్రాలు కొన్ని బైటపడ్డాయి. వాటిలో సానియా ఇంట్లో చూసిన వాటికి నకళ్ళు కూడా ఉన్నాయి. సిగరెట్ వెలిగించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. వాటి గురించి అమల నాకెప్పుడూ చెప్పలేదు.హఠాత్తుగా నా ఎదుట ప్రత్యక్షమయింది అమల. ఆమె డ్యూటీ రాత్రి ఎనిమిది గంటల వరకు. కానీ ఆ రోజు ఎందుకో త్వరగా వచ్చేసింది! ‘‘నేను లేని సమయంలో నా బీరువా ఎందుకు తెరిచావ్?’’ తీవ్రంగా అంటూ నా చేతిలోని పత్రాలను లాక్కుంది. ఆ పత్రాలను గురించీ, అందులోని ఆస్తులను గురించీ, అబ్దుల్లాకి తాను బినామీగా వ్యవహరించడం గురించీ నిలదీసాను. అది మా మధ్య ఘర్షణకు దారి తీసింది. ఎదురు దాడికి దిగింది. ఉద్రిక్తతకు గురికావడంతో మైకం కమ్మి పడిపోయాను. స్పృహలోకి వచ్చేసరికి అమల అక్కడ లేదు. టీ పెట్టుకుందామని కిచెన్‌లోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించబోతే, హాల్లోంచి అలికిడి వినిపించింది. అటువైపు వెళ్ళాను, అమల దగ్గరి పత్రాలను తీసుకుని కాల్చేయాలని. తరువాత వాటి సంగతి వెలుగులోకి వస్తే, తాను ప్రమాదంలో చిక్కుకోకూడదన్నదే నా ఆలోచన. అమల హాల్లో కనిపించలేదు. సిగరెట్ ముట్టించి, ఇల్లంతా వెదికాను. కనిపించలేదు. ఫ్రస్ట్రేషన్‌తో చేతిలోని సిగరెట్‌ని కోపంగా విసిరికొట్టి బైటకు నడిచాను. ఐతే, అది కిచెన్‌లో పడటమూ, అంతకుముందు నేను ఆన్ చేసి ఉండడంతో గ్యాస్ లీకై పేలుడు సంభవించడమూ తృటిలో జరిగిపోయాయి. కిచెన్ అంటుకుని కాలుతోంది. హాల్లో ఉన్న నేను దూరంగా ఎగిరిపడి స్వల్పగాయాలతో బైటపడటం జరిగింది. ఎదురుచూడని ఆ సంఘటనకు కొయ్యబారిపోయాను. క్షణాలలో అక్కడి వాతావరణం మారిపోయింది. ఇరుగుపొరుగు వారంతా పరుగెత్తుకు రావడము, మంటలు ఆర్పడానికి ప్రయత్నించడము, ఫోన్ కాల్స్ అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీసులు రావడమూ జరిగాయి. అమల జాడ లేదు. అంతకు మునుపు మా గొడవలను విన్న ఇరుగుపొరుగు వారు, నేను గ్యాస్ లీక్ చేసి తనను చంపేసానని ఫిర్యాదు చేసారు పోలీసులకు. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో, పోలీసులు నన్ను అరెస్ట్ ఐతే చేసారు కాని, అమల డెడ్ బాడీని మాత్రం కనిపెట్టలేకపోయారు! న్యాయస్థానం నాకు పద్నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ రిమాండుని విధించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమల చచ్చిపోయిందన్న బాధ ఒక వంకా, భార్యా హంతకుడన్న ముద్ర మరో వంకా నన్ను కుంగదీసాయి. దినపత్రికలలో వార్తలు చూసి నన్ను పరామర్శించడానికి వచ్చిన సానియా, నాకు బెయిల్ ఇప్పిస్తానంటే వద్దన్నాను. వారం రోజుల తరువాత ఓ రోజున జైలర్ వచ్చి చెప్పిన విషయాలు నాకు సంతోషాన్నీ, దుఃఖాన్నీ కలిగించాయి. అమల మంటల్లో పడి చనిపోలేదట. ఆ సమయంలో తాను ఇంట్లో లేదట. ఎక్కడికో స్కూటర్‌పైన వెళుతూ ఓ రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ప్రభుత్వాసుపత్రిలో చేర్చబడిందట. ఆ రోజు ఉదయమే ఆమె కోమాలోంచి బైటపడడంతో, వివరాలు తెలుసుకుని నాకోసం కబురుపెట్టారట. నా నిర్దోషిత్వం రుజువయిందన్న దానికంటే, అమల బతికి ఉన్నందుకే మిక్కిలి ఆనందం కలిగింది. ఐతే, ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న అమలను చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది. ఆ రోజు నాతో గొడవపడిన అమల, నాకు స్పృహæతప్పడంతో కోపంతో అలాగే వదిలేసి స్కూటర్ ఎక్కి బైటకు వెళ్ళిపోయిందట. తన పేరిట ఉన్న ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్లను తెచ్చుకునేందుకని అబ్దుల్లా ఇంటికి బైలుదేరిందట. దారిలో సిటీ బస్ ఒకటి వెనుక నుండి వచ్చి గుద్దుకోవడంతో ఎగిరి దూరంగా పడిపోయిందట. ఆ తరువాత ఏం జరిగిందీ తనకు తెలియదట – హీనస్వరంతో అమల జరిగింది చెబుతుంటే నా మది గిలగిల కొట్టుకుంది. ఆ స్థితికి నేనే కారణమన్న అపరాధ భావన నా గుండెలను పిండేసింది. నాపైన మోపబడ్డ ఆరోపణ గురించీ, నేను జైలుకు వెళ్ళడం గురించీ తెలుసుకుని బాధపడింది అమల. పోలీసులను పిలిపించి తన వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ రాత్రే నన్ను ఒంటరివాణ్ని చేసి తను చనిపోయింది.నెల్లాళ్ళ తరువాత సానియా నా వద్దకు వచ్చింది. ‘‘అబ్దుల్లా కారణంగా ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’ అందామె. ‘‘అబ్దుల్లా అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ, హోటల్‌తో సహా, చారిటీస్‌కి రాసేసాను’’ అంది. ఓ క్షణం విస్తుపాటుకు గురైనా, ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాను. - తిరుమల శ్రీ -
మళ్లీ జైట్‘లై’ అన్న రాహుల్
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆయన పేరు విరుపులతో ట్వీట్ చేశారు. ‘డియర్ మిస్టర్ జైట్లై(Jaitlie)..రక్షణ కొనుగోళ్ల వివరాలను యూపీఏ బహిర్గతం చేయలేదన్నారు కదా..మీవి అబద్ధాలని నిరూపించేందుకు అప్పుడు పార్లమెంట్లో మేము ఇచ్చిన వివరణలు ఇవిగో’ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను పోస్ట్ చేసే ముందు స్పెల్లింగ్ చెక్ చేసుకున్నారా? అని విలేకర్లు అడగ్గా...నేను స్పెల్లింగ్ చెక్ చేసుకోవాలా? అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. -
అంచనా తప్పింది!
♦ యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువు ♦ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు ♦ గుర్తించిన ఖాళీ స్థలాల్లో సగానికే అర్జీలు ♦ నోటీసుల జారీలో యంత్రాంగం వైఫల్యం జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 5,700 మంది పొజిషన్లో ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ లెక్క తప్పింది. మిగులు భూముల క్రమబద్ధీకరణ ఖజానాకు కాసులవర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు అంచనాలు తలకిందులవుతున్నాయి. పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం అని హెచ్చరించినా ఆక్రమణదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులు చే యని స్థలాలను స్వాధీనం చేసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఖాళీ భూములను 22ఏ కింద ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. జీఓ 92 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం.. వీటిలో 5,700 మంది పోజిషన్లో ఉన్నట్లు నిర్ధారించింది. సగం మందికే నోటీసులు యూఎల్సీ స్థలాల రెగ్యులరైజేషన్‌కు ఇదే ఆఖరి చాన్స్ అని ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు శివార్లలోని 11 మండలాల్లో గుర్తించిన ఖాళీ మిగులు భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వారం రోజుల క్రితమే పూర్తి చేసినట్లు ప్రకటించింది. ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి మరీ క్రమబద్ధీకరణ సమాచారాన్ని చేరవేసినట్లు స్పష్టం చేసింది. అధికారయంత్రాంగం చెప్పినట్లు క్షేత్రస్థాయిలో నోటీసుల జారీ జరగలేదని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. రాజధాని పరిసరాల్లో 11 మండలాల్లో 5,476 పార్శిళ్లలో యూఎల్సీ ఖాళీ స్థలాలున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు సర్వేలో తేలింది. తగ్గిన ఖాళీ స్థలాలు మిగులు భూములను కూడా క్రమబద్ధీకరణ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్నాళ్ల క్రితం రెవెన్యూ సిబ్బందితో జిల్లా యంత్రాంగం సర్వే చేయించింది. దీంట్లో 5,476 చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించింది. తాజాగా క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీఓ జారీ చేయగానే వీటి సంఖ్య భారీగా తగ్గింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి ఖాళీ స్థలాల జాబితా రూపొందించడంతో ఈ సంఖ్య 4,720గా తేలింది. ఈ మేరకు గుర్తించిన స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినా అది సాధ్యపడలేదు. అర్జీల సమర్పణకు తుది గడువు సమీపించినా.. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే నోటీసులు అందజేసి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పొడగిస్తారనే ధీమా కాబోలు.. నోటీసుల జారీని చాలా తేలికగా తీసుకున్నారు. మిగులు భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ధరకు అటు ఇటుగా వెచ్చించి కొనుగోలు చేసిన భూములకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కొందరికి సాధ్యంకాకపోవడం.. న్యాయపర చిక్కులు.. స్థలాలు చేతులు మారడం వంటివి దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. -
నల్లబడ్డ చర్మం నార్మల్‌గా మారాలంటే..!
స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ప్రతిరోజూ టూ వీలర్ మీద ఎండలో చాలా దూరం ప్రయాణం చేస్తుంటాను. ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న రెండు చేతులు చాలా నల్లగా (డార్క్‌గా) అవుతున్నట్లు గుర్తించాను. అలాగే ముఖం, కాళ్లు, మెడ భాగం కూడా నల్లగా మారుతున్నాయి. దుస్తులు కప్పుతున్న భాగంలోనూ, మిగతా భాగాల్లోనూ చర్మం రంగుకు చాలా తేడా ఉంది. ఈ నలుపు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. - సురేశ్‌కుమార్, విశాఖపట్నం మీరు ఎండలో చాలా ఎక్కువ సేపు ప్రయాణం చేస్తుండటం వల్ల దుస్తులు కప్పి ఉంచని భాగాల్లో మీ చర్మం దెబ్బతింటోంది. ఒకేసారి కాకుండా క్రమంగా జరిగిన పరిణామమిది. మీ చర్మానికి జరిగిన నష్టాన్ని తగ్గించడానికి చేయాల్సినవి... భౌతికంగా జరిగే నష్ట నివారణ కోసం... * వీలైనంత వరకు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించండి. పాదాలకు సాక్స్ ధరించండి. దీంతో నేరుగా మీకు ఎండ వల్ల కలిగే నష్టం సంభవించదు. * శరీరం ఎండకు ఎక్స్పోజ్ అయ్యే భాగాల్లో 50 కంటే ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాయండి. మీరు బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు ఇది రాసుకోండి. ఇదే ప్రక్రియ ప్రతి మూడు గంటలకు ఒకసారి చేయండి. చికిత్స పరంగా చేయాల్సినవి... * డాక్టర్‌ను కలిసి ప్రతిరోజూ భోజనం తర్వాత తీసుకోవాల్సిన యాంటీఆక్సిడెంట్ ట్యాబ్లెట్లను ప్రిస్క్రయిబ్ చేయించుకోండి. వాటిని మూడు నెలలు కొనసాగించండి. * కనీసం నెల రోజుల పాటు విటమిన్-సి టాబ్లెట్లను వాడండి. శాండల్‌వుడ్ కలిగి ఉండే సబ్బులకు, క్రీమ్స్‌కు దూరంగా ఉండండి. మైల్డ్ అలోవీరా, షియాబటర్ ఉన్న షవర్ జెల్ వాడండి. ప్రతిరోజూ స్నానం తర్వాత కోకోబటర్, విటమిన్-ఈ కలిగి ఉన్న మాయిష్చరైజర్లను వాడండి. ప్రతి రోజూ రాత్రిపూట... విటమిన్-సి, విటమిన్-ఈ, లికోరైస్, కోజిక్ యాసిడ్, టెట్రా హైడ్రోకర్క్యుమిన్, అర్బ్యుటిన్ వంటి స్కిన్లెటైనింగ్ ఏజెంట్స్ కలిగి ఉన్న క్రీమ్‌ను చర్మం నల్లబారిన చోట ఒంటిపై రాసుకోవాలి. * ఒకవేళ నలుపు మరీ ఎక్కువగా ఉంటే కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలను కనీసం 3 - 6 సెషన్లు చేయించుకోవాలి. లేదా లేజర్ టోనింగ్‌ను ఆరు సెషన్లు చేయించవచ్చు. లేదా మైక్రోడెర్మాబ్రేషన్ ప్రక్రియను ఎనిమిది సెషన్లు చేయించుకోవాలి. ఒకవేళ అప్పటికీ చర్మం రంగు మారకపోతే ఫ్రాక్షనల్ లేజర్ ప్రక్రియ చేయించుకోవచ్చు. ఈ చికిత్స ప్రక్రియలను అనుసరించాక కూడా కొంతకాలం పాటు మెయింటెనెన్స్ సెషెన్స్ కూడా అవసరమవుతాయి. కెమికల్ పీలింగ్ ప్రక్రియ ప్రతి మూడు మాసాలకు ఒకసారి, లేజర్ ప్రక్రియ ప్రతి రెండు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. ఆహారపరమైన జాగ్రత్తలు ఇవి... * మేని సంరక్షణలో ఆహారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారంలో క్యారట్, బీట్రూట్, కాప్సికమ్ (ఎల్లో అండ్ రెడ్), బొప్పాయి, అవకాడో, టొమాటో, ఉసిరి వంటి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. * పైన పేర్కొన్న వాటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చర్మం ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
పల్మొనాలజీ కౌన్సెలింగ్
మావారికి ఆస్థమా ఉంది. ఇది ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ అని తేలింది. ఒక్కోసారి అది ప్రమాదకరం కూడా అని తెలిశాక ఆందోళనగా ఉంది. నిమోనియా నివారించడానికి జాగ్రత్తలు చెప్పండి. - సునీత, గుంటూరు పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి బయటి వాతావరణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. మావారు సిగరెట్లు ఎక్కువగా తాగుతారు. దగ్గు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌ను కలిశాం. సీవోపీడీ అనే జబ్బు ఉందని చెప్పి మందులు ఇచ్చారు. దీన్ని ఎలా నిర్ధారణ చేశారు? నివారించుకునే అవకాశం చెప్పండి. - శ్రీలత, విజయవాడ సీఓపీడీని నిర్ధారణ చేయడానికి స్పైరోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని సహాయంతో కొన్ని శ్వాస పరీక్షలు చేసి వ్యాధితో పాటు... అది తక్కువ (మైల్డ్)గా ఉందా, ఓ మోస్తరా (మాడరేట్) లేక తీవ్రం (సివియర్)గా ఉందా అన్నది నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు అతడు పనిచేసే ప్రదేశం, వాతావరణం, వృత్తిగత సమస్యల (ప్రొఫెషనల్ హజార్డ్స్) వంటి అంశాల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. నివారణ: పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండాలి / పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం మానేయాలి. ఊపిరితిత్తుల్లోకి పొగ ప్రవేశిస్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం (కళ్లె) మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ (ప్రాణవాయువు) పాళ్లు బాగా తగ్గి, పనిచేసే శక్తిని, సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే వ్యాధి ఉన్నవారు ముందుగా పొగతాగే అలవాటుపై కష్టమైనా నియంత్రణ సాధించాలి. డాక్టర్ రమణప్రసాద్ వి.వి. సీనియర్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్