అక్రమాలపై నిఘా.. సీ విజిల్, అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు
సిరిసిల్ల: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో కీలకమైనవి. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును స్వేచ్ఛగా.. నిర్భయంగా వినియోగించుకునే సమయం ఇది. తెలంగాణలో ముందస్తుగా జరుగుతున్న ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఓటర్లలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యాన్ని కలిగించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లోని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాల్లో ఓటు చైతన్యంపై ప్రచార పోస్టర్లు వేస్తున్నారు. ఓటును అమ్ముకోవద్దని కోరుతూ ఎన్నికల్లో అక్రమాలపై సమాచారం అందించేందుకు పౌరులకు అందించిన ఆయుధం సీ విజల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పక్రియలో ఎన్నడూ లేని విధంగా నవ్యపథంలో ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలోపాటు, వేములవాడ, అన్నిమండల కేంద్రాల్లోనూ ఓట్లపై ప్రజా చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికల తేదీని మరిచిపోకుండా ఉండేందుకు ఈనెల 7న ఎన్నికలు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ జిల్లా యంత్రాంగం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment