right vote
-
చైతన్యం.. నవ్యపథం
సిరిసిల్ల: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో కీలకమైనవి. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును స్వేచ్ఛగా.. నిర్భయంగా వినియోగించుకునే సమయం ఇది. తెలంగాణలో ముందస్తుగా జరుగుతున్న ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఓటర్లలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యాన్ని కలిగించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాల్లో ఓటు చైతన్యంపై ప్రచార పోస్టర్లు వేస్తున్నారు. ఓటును అమ్ముకోవద్దని కోరుతూ ఎన్నికల్లో అక్రమాలపై సమాచారం అందించేందుకు పౌరులకు అందించిన ఆయుధం సీ విజల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పక్రియలో ఎన్నడూ లేని విధంగా నవ్యపథంలో ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలోపాటు, వేములవాడ, అన్నిమండల కేంద్రాల్లోనూ ఓట్లపై ప్రజా చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికల తేదీని మరిచిపోకుండా ఉండేందుకు ఈనెల 7న ఎన్నికలు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ జిల్లా యంత్రాంగం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. -
నేడు తుది పోరు
ప్రాదేశిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోరు శుక్రవారం జరగనుంది. నల్లగొండ, భువనగిరి డివిజన్ల పరిధిలోని 26మండలాల్లో గల 358 ఎంపీటీసీ, 26 జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 8,85,559 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 362 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 358 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు ఉన్న బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. ఈ ఎన్నికలకు 2,454 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 696 ప్రాంతాల్లో 1,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భువనగిరి సమీపంలోని అనాజిపురం వద్ద ఉన్న దివ్యబాల విద్యాలయానికి నల్లగొండ డివిజన్‌కు చెందిన బ్యాలెట్ బాక్సులను శ్రీరామానందతీర్థ ఇంజినీరింగ్ కాలేజీకి తరలిస్తారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను కంటికి రెప్పలా కాపాడేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు భారీ బందోబస్తు ఎన్నికలు పూర్తయిన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పోలీస్ సిబ్బందిని మలి విడత ఎన్నికలకు బందోబస్తుకు మళ్లించారు. డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలుపుకుని సుమారు 3వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వీరితో పాటు బయటి జిల్లాల నుంచి కూడా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను రప్పించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక స్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ టీములను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ సర ళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 105 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఈ గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా పోలింగ్ సరళిని రికార్డు చేస్తారు. -
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
-
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
374 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీలకు ఎన్నికలు రేపు ఎంపీటీసీ బరిలో 969 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో వంద మంది అభ్యర్థుల పోటీ ఒంగోలు, న్యూస్‌లైన్: మలిదశ ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఆరు నియోజకవర్గాల్లోని 9,42,722 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 28 మండలాల్లో ఎన్నికలు: రెండో దశ ప్రాదేశిక ఎన్నికలు ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో 28 మండలాల్లోని 381 ఎంపీటీసీ స్థానాలకు జరగాల్సి ఉంది. వీటిలో దర్శి -2, క్రిస్టియన్‌పాలెం, తాళ్లూరు మండలం మల్కాపురం మండల ప్రాదేశికాలు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా కనిగిరి మండలం చాకిరాలు, పీసీపల్లి మండలం గుదేవారిపాలెం స్థానాలు టీడీపీ ఖాతాకు జమయ్యాయి. ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం, లింగసముద్రం మండలం ముత్యాలపాడు, తాళ్లూరు మండలం మన్నేపల్లి ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఏడు ప్రాదేశికాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 969 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో బీఎస్పీ 5, బీజేపీ 8, సీపీఐ 11, సీపీఎం 16, కాంగ్రెస్ 35, వైఎస్సార్ సీపీ 363, టీడీపీ 363, లోక్‌సత్తా 2, స్వతంత్రులు 166 మంది పోటీలో ఉన్నారు. రెండో దశలో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎస్పీ 5, బీజేపీ 2, సీపీఐ 3, సీపీఎం 2, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 27, టీడీపీ 28, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 25 మంది వెరసి మొత్తం వంద మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అభ్యర్థి నూకసాని బాలాజీ జిల్లా అంతటా ప్రచారం నిర్వహించి అభ్యర్థులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటే టీడీపీ నేతలు మాత్రం టికెట్ల వేటలో రాజధానిలో మకాం వేశారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర నిరాసక్తత కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు 6,855 మంది సిబ్బంది: రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,855 మంది సిబ్బందిని జిల్లా అధికారులు వినియోగిస్తున్నారు. 1270 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. 1,395 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,395 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 4,065 మంది ఇతర పోలింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం గురువారం ఉదయం 7 గంటలకల్లా సంబంధిత మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలని ఇప్పటికే జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు డివిజన్లో 7 మండలాల్లో, కందుకూరు డివిజన్లోని 21 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
తొలి విడతలో వైఎస్ఆర్సీపీ హవా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, రైతులు ఓటుహక్కును వినియోగించుకోవడానికి పోటీపడ్డారు. ఫలితంగా మునిసిపల్ ఎన్నికలకన్నా అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడం.. ప్రధానంగా మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొనడం.. గ్రామాల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ అధికంగా ఉండటంతో తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి స్పీడు స్పష్టంగా కన్పించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ స్థానాలు స్వీప్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఒకట్రెండు జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్సీపీకి టీడీపీ దీటైన పోటీ ఇవ్వగలిగిందని విశ్లేషిస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం తొలి విడత గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లోని 31 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జెడ్పీటీసీసీ స్థానాల్లో 83.01 శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 83.11 శాతం ఓట్లు పోలయ్యాయి. మునిసిపల్ ఎన్నికల్లో సగటున 71.49 శాతం ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో పల్లెల్లో సింహభాగం ప్రజలు లబ్ధి పొందారు. ప్రధానంగా రైతు, రైతు కూలీ వర్గాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దన్నుగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయగల సత్తా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మాత్రమే ఉందని ప్రజానీకం విశ్వసిస్తున్నారు. ఇది సహకార, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు అదే రీతిలో తీర్పు ఇచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాతో ఆ నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు కూడా ఏకీభవిస్తుండటం గమనార్హం. ఉరవకొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఉన్న కూడేరు, బెళుగుప్ప మండలాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఓటింగ్ వైఎస్సార్సీపీకి మద్దతుగా ఏకపక్షంగా సాగింది. ఉరవకొండ జెడ్పీటీసీ స్థానంలో ఇరు పక్షాల మధ్య పోటాపోటీగా పోలింగ్ సాగినా.. అంతిమంగా వైఎస్సార్సీపీదే విజయమని విశ్లేషిస్తున్నారు. అంటే.. ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అన్ని జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ స్వీప్ చేయబోతోంది. గుంతకల్లు నియోజకవర్గంలో గుత్తి, పామిడి జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరడం ఖాయం. టీడీపీకీ పట్టున్న గుంతకల్లు మండలంలో ఓటర్లు వైఎస్సార్సీపీకి దన్నుగా నిలిచినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరిస్తోంది. గుంతకల్లు జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ-టీడీపీల మధ్య నున్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించడం ఖాయం. కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. పీసీసీ చీఫ్ రఘువీరా ప్రాతినిధ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు.మడకశిర నియోజకవర్గంలో గుడిబండ, రొళ్ల జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరనున్నాయి. అమరాపురం, మడకశిర, అగళి మండలాల్లో వైఎస్సార్సీపీ-టీడీపీల మధ్య పోటా నువ్వానేనా అన్నట్లుగా సాగింది. పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటలు బీటలు వారక తప్పదని పోలింగ్ సరళి స్పష్టం చేసింది. గోరంట్ల, పెనుకొండ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. సోమందేపల్లి, పరిగి మండలాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు. రొద్దం మండలంలో మాత్రమే వైఎస్సార్సీపీ-టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది.టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీకి దన్నుగా నిలుస్తోన్న హిందూపురంలోనూ ప్రాదేశిక ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. చిలమత్తూరు జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయం. హిందూపురం, లేపాక్షి జెడ్పీటీసీ స్థానాల్లో ఇరు పక్షాల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. -
ఈశాన్య యువత ఓటు కీలకం
తొలిసారిగా ఓటుహక్కు పొందిన ఈశాన్య యువత ఈ ఎన్నికల్లో అత్యంత కీలకపాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశరాజధానిలో జాతివివక్ష కారణంగా నలిగిపోయిన వీరంతా సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను తోసిరాజని తమకు అండదండగా నిలుస్తారని భావించేవారికే మద్దతు పలకాలని నిర్ణయించారు. పార్లమెంటులో తమ వాణిని బలంగా వినిపించగలిగిన నాయకులను ఎన్నుకోవాలనే ఆకాంక్ష వారిలో బలంగా ఉంది. న్యూఢిల్లీ: ఈసారి ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతపాత్ర కీలకం కానుంది. వీరంతా తొలిసారిగా ఓటు వేయనున్నారు. ఏడాదికిపైగా అందరి దృష్టీ వీరిపైనే ఉంది. ఇందుకు కారణమేదైనప్పటికీ ఈ ఎన్నికల్లో విభిన్నంగా వ్యవహరించాలని వారంతా నిర్ణయించుకున్నారు. అత్యంత విచారం కలిగించే విషయమేమిటంటే అంద రూ తమను ఎంతమాత్రం పట్టించుకోకపోవడమేనని వారంతా భావిస్తున్నారు. అయితే తమ వాణిని గట్టిగా వినిపించాలని, తమ నిరసనను తీవ్రస్థాయిలో తెలియజేయాలని వారంతా దృఢంగా నిర్ణయించుకున్నారు. ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి తమ ఓటుహక్కును వినియోగించుకోవడంద్వారా నిరసన తెలియజేయాలనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త పార్టీ ఆవిర్భవించాలి నగరంలోని హిందూ కళాశాలలో చదువుతున్న కృత్తిక చెట్రి ఈ విషయమై మాట్లాడుతూ తమ వాణిని వినిపించే ఓ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు తమ సాధకబాధకాలను వినిపించేవారై ఉండాలన్నారు. తమకు అన్నివిధాలుగా అండదండగా నిలిచేవారు అవసర మన్నారు. అదేవిధంగా తామంతా ఒకే ఒక పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు తమను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గట్టి నేతను ఎన్నుకోవాలి నాగాలాండ్‌కు చెందిన కెల్హోయిసిలీ పీయున్యు మా ట్లాడుతూ తమ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చేంత సామర్థ్యం కలిగిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. గత కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తీవ్ర జాతి వివక్షకు గురవుతున్నామనే విషయాన్ని ఈశాన్య రాష్ట్రీయులు గుర్తించాల్సిన తరుణమిదేనన్నారు. నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ పరిస్థితి తలె త్తిందన్నారు. జాతి వివక్ష విషయంలో కఠినచట్టాలు ఉండాలని యువత కోరుకుంటోందన్నారు. ఇందుకోసమే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువత ఈసా రి పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొననుంద న్నారు. ఎన్నో పర్యాయాలు ఆందోళనకు దిగామన్నారు. అండగా నిలిచేవారికే ఓటు ఇదే విషయమై మణిపూర్‌కు చెందిన కరోలిన్ మానిని మాట్లాడుతూ తమకు అండగా నిలిచావారికే తాను ఓటు వేస్తానని చెప్పింది. సిక్కింకు చెందిన ఉజ్వల్ పాండే మాట్లాడుతూ ఓటు వేయడం తన విద్యుక్త ధర్మమన్నాడు. ఇప్పుడు కనుక సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే వచ్చే ఐదు సంవత్సరాలపాటు తమ ప్రాంతంపై దాని ప్రభావం పడుతుందన్నాడు. ‘ఇది మా హక్కు. అందువల్ల దీనిని మేము కచ్చితంగా వినియోగించుకోవాల్సిందే. ఎందుచేతనంటే ఇది మా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. జాతివివక్ష వ్యతిరేక చట్టాలను అమలులోకి తీసుకురాగల సత్తా కలిగిన ప్రభుతాన్ని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం’ అని అన్నాడు. కేవలం విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినంతమాత్రాన సరిపోదన్నాడు. బతుకుదెరువుకోసం ఇక్కడికి వచ్చే మహిళల పరిస్థితి ఏమిటన్నాడు. ఒకవేళ దేశరాజధాని నుంచి విడిచి స్వస్థలాలకు వెళ్లిపోయినా అక్కడ తమకు ఉపాధి అవకాశాలు ఉండబోవన్నాడు. విధిలేకనే ఇక్కడికి రావాల్సి వస్తోందన్నాడు. కాగా తమ సమస్యలను తమంతట తామే పరిష్కరించుకోకతప్పదని కొందరు అనుకుంటుండగా, ఓటుహక్కును వినియోగించుకుంటే పరిస్థితుల్లో కొంతమార్పు రావచ్చని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడొచ్చని మరికొందరు అనుకుంటున్నారు. తమ ప్రాంతంలో వైద్యసేవలు బాగా తక్కువని ఇంకొందరు భావిస్తున్నారు. ఇదే విషయమై అసోంకు చెందిన డాక్టర్ కుల్దీప్ స్వర్గైరీ మాట్లాడుతూ ‘మా ప్రాంతంలో ఆరోగ్య సేవలు అంతంతమాత్రమే. అందువల్ల దీనిపై మేమంతా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా చెప్పుకోదగ్గస్థాయిలో లేవు. వనరులను వినియోగించుకోగల సత్తా కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది’ అని అన్నాడు. ఇదే సరైన సమయం సిక్కింకు చెందిన సుల్ట్రిమ్ నోర్బు మాట్లాడుతూ ‘ఇదే సరైన సమయం. ఇప్పుడు కనుక చేజారిపోతే మా సమస్యల్ని మేము ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుంది. పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది’ అని అన్నాడు. కాగా ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 814 మిలియన్ల మంది 16వ లోక్‌సభకు ఓటువేయనున్నారు. రష్యా, అమెరికా, బ్రెజిల్, బంగ్లాదేశ్ జనాభాతో ఈ సంఖ్య సరిమానం. 2009 నాటి ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ పర్యాయం బాగానే పెరిగింది. మణిపురి యువతుల్ని వేధించిన ఇద్దరి అరెస్టు న్యూఢిల్లీ: మణిపురి యువతులను వేధించిన కేసులో ఐదునక్షత్రాల హోటల్ ఉద్యోగిసహా ఇద్దరు అరెస్టయ్యారు. వీరిరువురూ దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పురి ప్రాంతానికి చెందినవారు. నిందితులను వికాస్ అలియాస్ విక్కీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జానీగా గుర్తించారు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వికాస్...ఐదునక్షత్రాల హోటల్ ఉద్యోగి కాగా జానీ అతని బంధువు. ఇతడు నిరుద్యోగి. ఇద్దరు కలిసి ఓ కిరాయి గదెలో నివసిస్తున్నారు. వీరిరువురూ తరచూ కిటికీలు తెరిచి తమ గదిలోకి తొంగి తొంగి చూస్తుంటారని, అంతేకాకుండా తమను వేధిస్తున్నారని గుర్గావ్లోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న ఇద్దరు మణిపురి యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కిటికీ కి ఓ రంధ్రం కూడా పెట్టారని బాధిత మహిళలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా తరచూ తలుపు కొడతారని, తీసేలోగానే అక్కడినుంచి మాయమవుతుంటారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుమేరకు వసంత్‌కుంజ్ స్టేషన్‌కు చెందిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితులు వీడియో కెమెరా ద్వారా అభ్యంతరకర దృశ్యాలను నమోదుచేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.