Kotak Mahindra Bank acquires microfinance institution Sonata Finance for ₹537 crore - Sakshi
Sakshi News home page

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చేతికి సొనాటా, ఎన్ని కోట్ల డీల్‌ అంటే!

Published Sat, Feb 11 2023 11:41 AM | Last Updated on Sat, Feb 11 2023 12:00 PM

Kotak Mahindra Bank acquires microfinance institution Sonata Finance - Sakshi

ముంబై: సూక్ష్మ రుణాల సంస్థ సొనాటా ఫైనాన్స్‌ను రూ. 537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ (కేఎంబీ) వెల్లడించింది. ఇది పూర్తి నగదు రూపంలోనే జరిగిందని సంస్థ వివరించింది.  2017లో బీఎస్‌ఎస్‌ మైక్రోఫైనాన్స్‌ను దక్కించుకున్న తర్వాత ఈ తరహా డీల్స్‌లో కేఎంబీకి ఇది రెండోది. దీనితో 9 లక్షల మంది పైచిలుకు మహిళా కస్టమర్లు, 10 రాష్ట్రాల్లో 502 శాఖలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సొనాటా .. నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీ-మైక్రోఫైనాన్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐ)గా కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సంస్థ నిర్వహణలో రూ. 1,903 కోట్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ-అర్బన్‌ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని కేఎంబీ కమర్షియల్‌ బ్యాంకింగ్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ కొఠారీ చెప్పారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement