sonata
-
స్పోర్టియస్ట్ డిజైన్‌తో హ్యుందాయ్ సొనాటా సరికొత్తగా
సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్, లాంగ్ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్‌తో స్పోర్టియస్ట్ డిజైన్‌తో పరిచయం చేసింది. స్పోర్ట్, స్టాండర్డ్ , N లైన్ వేరియంట్లలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. హ్యుందాయ్ సొనాటా వెర్నా, కోనా ఎలక్ట్రిక్, స్టారియా పోలిన స్టయిల్‌తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్ప్లేను జోడించింది. సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ బార్, రియర్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ స్ట్రిప్, బ్లాక్ బార్, మధ్యలో హ్యుందాయ్ లోగో, డిఫరెంట్ గ్రిల్‌తో దీన్ని అప్డేట్ చేసింది. అలాగే స్పోర్టియర్ ఎక్స్టీరియర్ ఇమేజ్‌తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్ ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఎయిర్ వెంట్స్, న్యూ సెంట్రల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, న్యూ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మార్పులు కూడా చేసింది. ఇంజీన్ 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్స్ తో ఇది రానుంది. అలాగే ఎన్ లైన్లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్ 285హెచ్‌పీ పవర్, 422 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని ఆవిష్కరించనుంది. #Hyundai #SONATA inherits the identity of the 4-door coupe with Absolute Sportiness. And its futuristic and progressive interior is completed with our new technology, Panoramic Curved Display. On March 30th, #ThenewSONATA will be fully unveiled.#HyundaiDesign #SONATADesign pic.twitter.com/1r91CvNBIQ — Hyundai Motor Group (@HMGnewsroom) March 26, 2023 -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చేతికి సొనాటా, ఎన్ని కోట్ల డీల్ అంటే!
ముంబై: సూక్ష్మ రుణాల సంస్థ సొనాటా ఫైనాన్స్‌ను రూ. 537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్ మహీంద్ర బ్యాంక్ (కేఎంబీ) వెల్లడించింది. ఇది పూర్తి నగదు రూపంలోనే జరిగిందని సంస్థ వివరించింది. 2017లో బీఎస్ఎస్ మైక్రోఫైనాన్స్‌ను దక్కించుకున్న తర్వాత ఈ తరహా డీల్స్‌లో కేఎంబీకి ఇది రెండోది. దీనితో 9 లక్షల మంది పైచిలుకు మహిళా కస్టమర్లు, 10 రాష్ట్రాల్లో 502 శాఖలు లభిస్తాయని సంస్థ తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సొనాటా .. నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ-మైక్రోఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐ)గా కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థ నిర్వహణలో రూ. 1,903 కోట్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని కేఎంబీ కమర్షియల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ మనీష్ కొఠారీ చెప్పారు. -
‘సొనాటా’ వెడ్డింగ్ కలెక్షన్
హైదరాబాద్: వివాహ సీజన్ సందర్భంగా నూతన వధూవరుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్‌ను ప్రారంభించినట్లు టైటాన్ కంపెనీకి చెందిన ప్రముఖ వాచీల బ్రాండ్ ‘సొనాటా’ వెల్లడించింది. హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్లను ఈ కలెక్షన్లో భాగంగా అందిస్తోంది. వివాహ సమయంలో వధువులకు సరిగ్గా సరిపడే విధంగా బంగారం, రోజ్ గోల్డ్ ప్లేటింగ్‌తో నూతన వేరియంట్స్ అందుబాటులో ఉండగా... పురుషులు కోసం నాణ్యత, డిజైన్ పరంగా ప్రీమియంగా కనిపించే లెదర్ స్ట్రాప్స్, రోజ్ గోల్డ్ బై వంటి 10 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. వీటి ధరల శ్రేణి రూ.1,399 నుంచి రూ.2,299 వరకు ఉన్నట్లు తెలిపింది. -
స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంపై టైటాన్ దృష్టి
త్వరలో మార్కెట్లోకి ఫాస్ట్రాక్, సొనాట బ్రాండ్లలోనూ స్మార్ట్‌వాచ్‌లు! ముంబై: వాచ్‌లు, జువెలరీ తయారీ కంపెనీ ‘టైటాన్’ తాజాగా తన స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే కంపెనీ తన పలు బ్రాండ్లలో స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులోనే సొనాట, ఫాస్ట్రాక్ వంటివి ఉన్నారుు. గత కొన్ని త్రైమాసికాల్లో వాచ్‌ల బిజినెస్‌లో వృద్ధి మందగించడం వల్ల కంపెనీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టైటాన్ కంపెనీ ఈ ఏడాది జనవరిలో జెక్టస్ ప్రొడక్ట్‌తో స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘మంచి లుక్, స్మార్ట్ ఫీచర్లతో జెక్టస్ వాచ్‌లను రూపొందించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. దీని తర్వాత జెక్టస్ ప్రొ స్మార్ట్‌వాచ్‌లను తెచ్చాం. వీటిని ప్రజలు ఆదరించారు’ అని టైటాన్ వాచెస్ సీఈవో రవి కాంత్ తెలిపారు. తాము త్వరలో పలు వాచ్ బ్రాండ్లలో స్మార్ట్‌వాచ్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వీటి ధర రూ.10,000లోపు ఉండేలా చూస్తామన్నారు. కాగా టైటాన్ కంపెనీ తాజాగా అమెరికాకు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ కెన్నెత్ కోలెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
కన్వర్జెన్స్ 2015లో సొనాటా సాఫ్ట్వేర్
హైదరాబాద్: బార్సిలోనా(స్పెయిన్)లో జరిగే కన్వర్జెన్స్ 2015 ఈఎంఈఏలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ టెక్నాలజీస్‌ను ప్రద ర్శించనున్నామని సొనాటా సాఫ్ట్వేర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30న ప్రారంభమయ్యే ఈ కన్వర్జెన్స్ వచ్చే నెల 2 వరకూ జరుగుతుందని సొనాటా సాఫ్ట్వేర్ హెడ్(డెలివరీ) పీవీఎస్ఎన్ రాజు చెప్పారు. ఈ కన్వర్జెన్స్‌లో బ్రిక్ అండ్ క్లిక్ రిటైలింగ్ వంటి వినూత్నమైన డిజిటల్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్స్, సొల్యూషన్స్‌ను డిస్ప్లే చేస్తామని తెలిపారు. ఇక ఇటీవలే తాము కొనుగోలు చేసిన ఇంటరాక్టివ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(ఐబీఐఎస్) సీఆర్ఎం సప్లై చెయిన్ సొల్యూషన్‌ను డిస్ప్లే చేస్తుందని ఆయన వివరించారు.