
హైదరాబాద్: వివాహ సీజన్ సందర్భంగా నూతన వధూవరుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్‌ను ప్రారంభించినట్లు టైటాన్ కంపెనీకి చెందిన ప్రముఖ వాచీల బ్రాండ్ ‘సొనాటా’ వెల్లడించింది. హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్లను ఈ కలెక్షన్‌లో భాగంగా అందిస్తోంది. వివాహ సమయంలో వధువులకు సరిగ్గా సరిపడే విధంగా బంగారం, రోజ్ గోల్డ్ ప్లేటింగ్‌తో నూతన వేరియంట్స్ అందుబాటులో ఉండగా... పురుషులు కోసం నాణ్యత, డిజైన్ పరంగా ప్రీమియంగా కనిపించే లెదర్ స్ట్రాప్స్, రోజ్ గోల్డ్ బై వంటి 10 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. వీటి ధరల శ్రేణి రూ.1,399 నుంచి రూ.2,299 వరకు ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment