కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ.1,055 కోట్లు
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 16% వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) క్యూ4లో రూ.913 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,055 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. కీలక వడ్డీ ఆదాయం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది.నికర మొండి బకాయిలు 2.36%నికి చేరాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 1.3% వృద్ధితో రూ.731 వద్ద ముగిసింది.