మరో బ్యాంకు మేనేజర్ చిక్కాడు!
ఢిల్లీ: నోట్ల మార్పిడి ప్రారంభమైన దగ్గర నుంచి బ్యాంకు అధికారుల అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఓ వైపు సామాన్యులు ఒక్క నోటు కోసం గంటల కొద్ది బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే.. కొదరు బ్యాంకు అధికారులు మాత్రం కట్టల కొద్ది డబ్బును బడాబాబుల ఇళ్లకు చేర్చుతున్నారు.
తాజాగా ఢిల్లీలో మరో బ్యాంకు అధికారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చిక్కాడు. ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్ మహింద్రా బ్యాంకు బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. డీమానిటైజేషన్ నేపథ్యంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అతడిపై అరోపణలు ఉన్నాయి. అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.