
ముంబై: అర్హత కలిగిన డెబిట్ కార్డుహోల్డర్లందరికీ ప్రత్యేకమైన నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) ఆఫర్ అందిస్తున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీఎల్) వెల్లడించింది. దీని ప్రకారం మధ్య స్థాయి, అధిక విలువ చేసే కొనుగోళ్లు అన్నింటికీ డెబిట్ కార్డుపై ఈఎంఐల ద్వారా చెల్లించే సదుపాయం ఉంటుందని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పటిదాకా ఇది కేవలం ఎంపిక చేసిన కొన్ని స్టోర్స్‌కి మాత్రమే పరిమితమై ఉండేదని కేఎంబీఎల్ తెలిపింది. రూ. 5,000 అంతకు పైబడిన లావాదేవీలన్నింటినీ ఎలాంటి పేపర్‌వర్క్ లేదా పత్రాల అవసరం లేకుండానే ఈఎంఐల కింద మార్చుకోవచ్చని వివరించింది.
చదవండి : ఏంటీ..ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
Comments
Please login to add a commentAdd a comment