సాక్షి, ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత కొటాక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 27 శాతం పెరిగి రూ.1,595.90 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది 1,290.93 కోట్ల రూపాయలు. ప్రధాన ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం 3,429.53 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.2 శాతం పెరిగింది.
మొత్తం త్రైమాసికంలో మొత్తం ఆస్తుల శాతం 2.46 శాతంగా, స్థూల నిరర్థక ఆస్తులు డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించాయి. అంతకుముందు త్రైమాసికంలో 2.32 శాతంగా ఉన్నాయి. బ్యాడ్‌లోన్లు భారీగా ఎగిసాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో 5,413.20 కోట్ల రూపాయలుగా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,033.55 కోట్లు. ఈ త్రైమాసికంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ 2,16,774 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసింది. మొత్తం 1,539 శాఖల బ్యాంక్ బ్రాంచ్ నెట్‌వర్క్ కలిగి ఉందని బ్యాంక్ ఆదాయ ప్రకటనలో తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 4 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్టం రూ. 1,630 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment