నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసు సీజ్
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసును బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. తమకు తిరిగి చెల్లించాల్సిన రూ. 11 కోట్ల రుణాన్ని ఆయన చెల్లించకపోవడంతో కోటక్ మహీంద్రా బ్యాంకు అధికారులు ఈ ఆఫీసును సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను' సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పీడున్నోడు అనే మరో సినిమాలో కూడా శ్రీనివాస్ నటించాడు. అంతలోనే ఆయన తండ్రి, నిర్మాత సురేష్ కార్యాలయం సీజ్ కావడం గమనార్హం.