office seized
-
విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్
హైదరాబాద్: ప్రజా గాయని, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టీయూఎఫ్) నాయకురాలు విమలక్కపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆమె కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు. కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే చెందిన ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. ఇంతకు ముందు కూడా విమలక్కపై అనేక కేసులు నమోదైన సంగతి తలిసిందే. -
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసు సీజ్
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసును బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. తమకు తిరిగి చెల్లించాల్సిన రూ. 11 కోట్ల రుణాన్ని ఆయన చెల్లించకపోవడంతో కోటక్ మహీంద్రా బ్యాంకు అధికారులు ఈ ఆఫీసును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను' సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పీడున్నోడు అనే మరో సినిమాలో కూడా శ్రీనివాస్ నటించాడు. అంతలోనే ఆయన తండ్రి, నిర్మాత సురేష్ కార్యాలయం సీజ్ కావడం గమనార్హం.