మడకశిర : పావగడ మున్సిపల్ జూనియర్ ఇంజినీర్ ప్రకాశ్ ఓ కాంట్రాక్టర్‌తో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. పట్టణంలోని తన ఇంటిలో నిందితుడు ప్రకాశ్ కొన్ని కాంట్రాక్టు పనుల విషయంలో ఓ కాంట్రాక్టర్‌తో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా అప్పటికే పక్కా సమాచారంతో తుమకూరు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.