
న్యూఢిల్లీ: మలేసియా ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ మెరిశాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ప్రకాశ్ పసిడి పతకం గెలిచాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో ప్రకాశ్ ఒక నిమిషం 58.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు.
ఈ క్రమంలో అతను కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment