ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య | family suicide due to Anemia | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Published Thu, Jul 7 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

- ఒకే కుటుంబంలో నలుగురు మృతి
- అమరవెల్లిలో విషాదం

కొత్తపల్లి : 
అనారోగ్యం కారణంగా ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని అమరవిల్లిలో గురువారం జరిగింది. అమరవెల్లి గ్రామానికి చెందిన తాగల భూలక్ష్మీ ముగ్గురు కుమారులు ఉన్నారు. వారందరికీ రక్తహీనత ఒకరి తరువాత మరొకరి వచ్చింది.

తరచూ రక్తం మార్పిడి చేసుకోవాల్సి వస్తుందని వేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ముగ్గురు కొడుకులతో కలిసి అమరవెల్లి సమీపంలోని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో భూలక్ష్మీ (45), ప్రభు ప్రకాష్‌ (22), అనిల్‌ (20), ప్రేమ ప్రకాష్‌ (17) మృతి చెందారు. వారి కుటుంబంలో త్రీవ విషాదం నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement