రెండు భాషల్లో...సైజ్ జీరో... | Anushka's new film is Size Zero | Sakshi
Sakshi News home page

రెండు భాషల్లో...సైజ్ జీరో...

Published Tue, Feb 24 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

రెండు భాషల్లో...సైజ్ జీరో...

రెండు భాషల్లో...సైజ్ జీరో...

బొద్దుగుమ్మ అనుష్క ఏంటి?... సైజ్ జీరో ఏంటి? అనుకుంటున్నారు కదూ! అయితే ఆ వివరాలు సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడినే అడగాలి. చాలా విరామం తర్వాత ప్రకాశ్ ‘సైజ్ జీరో’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో అనుష్క, ఆర్య ప్రధాన తారలు. శ్రుతీహాసన్ అతిథి పాత్ర ధారిణి. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం ముహూర్తం జరిగింది.
 
  నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు ప్రకాశ్ భార్య కణికా థిల్లాన్ క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రసాద్ పొట్లూరి తెలిపారు. భరత్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: నీరవ్‌షా, ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణికా థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement