
‘నాన్న’కు సాయం
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ప్రకాశ్ కూతుళ్లు మాధురి, లక్ష్మీప్రసన్నలకు అందించారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి టీవీ శేఖర్ రూ.10 వేలు, వ్యాపారవేత్త మంచాల జగన్ రూ.5 వేలు, డాక్టర్ సుమన్ రూ.5 వేలు, శికారి రామకృష్ణ రూ.5 వేలు, మున్సిపల్ కమిషనర్ అల్లూరి వాణిరెడ్డి రూ.5 వేలు, టీఆర్‌ఎస్ నాయకులు సాయిని రవీందర్ రూ.5 వేలు సేకరించారు.
అలాగే, స్థానిక లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎలిమిల్ల రాంనారాయణ రూ.5 వేలు, దావనపల్లి రాజలింగం రూ. 5 వేలు, గుంటక చంద్రప్రకాశ్ రూ.5 వేలు, రవూఫ్ రూ.5 వేలు, మీనా ఫుట్‌వేర్ గోపం రాజు రూ.5 వేలు, డాక్టర్ జగదీశ్వర్ రూ.2,500, చాప కిషోర్ రూ.2 వేలు, బాస రాజగంగాగారం రూ.2 వేలు, బండారి నర్సయ్య రూ.2 వేలు, కటుకం శంకర్ రూ.1,500, కొమ్ము జీవన్‌రెడ్డి రూ.1,500, పిడుగు గుణాకర్‌రెడ్డి రూ.1,500, వనపర్తి చంద్రమోహన్ రూ.1,000, పోతని ప్రవీణ్ రూ.1,000 అందించారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం అందించిన దాతలకు ప్రకాశ్ కూతుళ్లు మాధురి, లక్ష్మీప్రసన్న, మనీషలు ధన్యవాదాలు తెలిపారు.