
ఇసుక అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు
వి.కోట(చిత్తూరు): ఇసుక అక్రమరవాణా చేస్తూ ఓ టీడీపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలానికి చెందిన టీడీపీ నేత ప్రకాశ్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి జేసీబీ, లారీలను సీజ్ చేశారు. అనంతరం ఈ తంతకు పాల్పడుతున్న ప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు.