పెళ్లి చూపులకెళుతూ తిరిగిరాని లోకాలకు.. | died to new marriage boy | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకెళుతూ తిరిగిరాని లోకాలకు..

Published Mon, Dec 1 2014 2:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

పెళ్లి చూపులకెళుతూ  తిరిగిరాని లోకాలకు.. - Sakshi

పెళ్లి చూపులకెళుతూ తిరిగిరాని లోకాలకు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు

 
కెలమంగళం :  పెళ్లి చూపులకు వెళుతున్న ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తళి కొత్తనూరు గ్రామానికి చెందిన  ఎన్.ప్రకాష్(28), స్నేహితుడు ప్రకాష్(22), వెంకటేశ్(40) కలిసి ద్విచక్ర వాహనంలో  పెళ్లి చూపుల కోసం డెంకణీకోట సమీపంలో అర్తకూరుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. డెంకణీకోట- తళి  రోడ్డు కాళేనట్టి వద్ద టెంఫో ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఎన్.ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్నేహితుడు వెంకటేశ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ప్రకాష్ తీవ్ర గాయాలపాలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని టెంపో డ్రైవర్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement