Amazon lays off about 100 employees in its gaming divisions - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ నుంచి 100 మంది అవుట్‌!

Published Wed, Apr 5 2023 12:22 PM | Last Updated on Wed, Apr 5 2023 12:30 PM

amazon lays off about 100 employees in gaming divisions - Sakshi

అమెజాన్‌ లేఆఫ్స్‌లో భాగంగా తాజాగా 100 మందిని తొలగించింది. వీడియో, గేమ్ విభాగాలలో పని చేస్తున్న సుమారు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, కంపెనీ శాన్ డియాగో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. ఈ మేరకు కంపెనీ గేమ్స్‌ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ హార్ట్‌మన్ ఏప్రిల్‌ 4న ఉద్యోగులకు మెమోలు పంపించారు. 

(ఈ-కామర్స్‌ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్‌ పేరు ఏంటంటే..)

ట్విచ్ స్ట్రీమింగ్ సర్వీస్‌లో భాగంగా ఉన్న క్రౌన్‌ చానెల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ షో సహా గేమింగ్‌ విభాగంలో మానవ వనరుల నిర్వహణకు అమెజాన్‌ కంపెనీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ట్విచ్‌ ఇటీవల 400 మంది ఉద్యోగులను తొలగించింది.  2012లో ఈ డివిజన్ ప్రారంభించినప్పటి నుంచి పలు సార్లు అమ్మకానికి ఉంచినా విక్రయించకుండా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అమెజాన్ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసింది కేవలం ఒకే ఒక్క గేమ్‌. అది కూడా 2021 సెప్టెంబర్ లాంచ్ తర్వాత దాని ప్లేయర్ బేస్ బాగా క్షీణించింది.

(విప్రో కన్జూమర్‌ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు)

తొలగింపులు ఉన్నప్పటికీ, శాన్ డియాగో స్టూడియోలో ప్రకటించని ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు గేమ్ ప్రీ ప్రొడక్షన్ దశలో రెట్టింపు అవుతారని హార్ట్‌మన్ చెప్పారు. అలాగే  మాంట్రియల్‌లోని అమెజాన్ స్టూడియోలో కూడా ఓ ప్రాజెక్ట్‌ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.  దక్షిణ కొరియా ఆన్‌లైన్ రోల్-ప్లేయింగ్ గేమ్ లాస్ట్ ఆర్క్‌ను ప్రచురించడం ద్వారా అమెజాన్‌ విజయాన్ని సాధించింది. థర్డ్ పార్టీ పబ్లిషింగ్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు హార్ట్‌మన్ పేర్కొన్నారు. NCSoft Corpతో ఇటీవలి ఒప్పందం కూడా అందులో భాగమేనని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement