సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ ‘డ్రీమ్‌హాక్’కు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికైంది. శుక్రవారం ప్రారంభమైన యాక్షన్–ప్యాక్డ్ గేమింగ్ మహోత్సవం మూడ్రోజులపాటు కొనసాగనుంది. గేమింగ్, స్పోర్ట్స్ టోర్నమెంట్, చెస్ డెత్ మ్యాచ్, రెట్రో గేమింగ్ వంటి వినూత్న గేమ్‌లతోపాటు వర్క్‌షాప్‌లు, అభిమానుల మీట్ అండ్ గ్రీట్, డ్యాన్స్ షో, మ్యూజిక్ జోన్, స్టాండప్ కామిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో నోడ్వింగ్ గేమింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్‌హాక్ గేమింగ్ మహోత్సవంలో ఇంటెల్, మాన్‌స్టర్, హ్యుందయ్, బింగో వంటి ప్రముఖ సంస్థలు గేమింగ్ వేదికలను ఏర్పాటు చేశాయి. పీసీ మోడ్, మొబైల్ మోడ్ విధానంలో గేమ్స్ నిర్వహించగా హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ నగరాల డిజిటల్ గేమర్స్ పాల్గొంటున్నారు.
డ్రీమ్‌హాక్ రాపిడ్ ఓపెన్ టోర్నమెంట్, డ్రీమ్‌హాక్ బ్లిట్జ్ ఓపెన్ టోర్నమెంట్, కేఓ ఫైట్ నైట్, పబ్‌జీ ఆధారిత గేమ్‌లు, రెట్రో జోన్ గేమ్స్ మోనోపోలీ, లూడో, క్యారమ్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూఎన్‌వో వంటి ప్రసిద్ధ బోర్డ్ గేమ్‌లతో డ్రీమ్‌హాక్ అలరిస్తుంది. వివిధ విభాగాల విజేతలకు లక్షల్లో నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు డ్రీమ్‌హాక్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment