సీసీ కెమెరాల్లో బయట పడిన దుండగుల ఫొటోలు
–వీరభద్రస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడింది వీరే
– సీసీ కెమెరాల్లో దొంగల చిత్రాలు నమోదు
దీబగుంట్ల(గోస్పాడు): దీబగుంట్ల గ్రామం వీరభద్రస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగల చిత్రాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వారం రోజుల క్రితం దేవాలయంలోని వీరభద్రస్వామికి సంబంధించిన వెండి వస్తువులు, హుండీలో ఉన్న సొమ్ము కాజేశారు. దీంతో గ్రామ పెద్దల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగల ఫొటోలు కనిపించాయి. వారి ఫొటోలను బుధవారం శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో చూపించారు. ఈ దొంగలను పట్టించిన వారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని ఎవరైనా గుర్తిస్తే సెల్: 94407 95541,94407 95513కి నంబర్లకు సమాచారం అందించాలని వారు కోరారు.