ఇద్దరు దొంగలు
న్యూయార్క్ : దొంగ దగ్గరే తన చేతికి పని చెప్పి దొరికిపోయాడో దొంగ. తను దొరికిపోవటమే కాకుండా ఆ మరో దొంగను కూడా పోలీసులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే.. మార్చి 10వ తేదీన షమారి జే రియెడ్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి టయోటా ఆర్‌ఏవీ4లో వెళుతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కగా టైకెల్ విల్సన్ అనే 19 ఏళ్ల యువకుడు పంక్షరైన తన కారు టైరు మార్చటానికి కష్టపడిపోతూ కనిపించాడు. దీంతో వారు టైకిల్‌కు సహాయం చేయటానికి కిందకు దిగారు. వారు కారు టైరు మారుస్తూ ఉండగా టికైల్.. రియెడ్ కారులోకి చేరుకున్నాడు.
ఆ కారును దొంగిలించటానికి ప్రయత్నించాడు. కారును రివర్స్ చేయగా అది కాస్తా పుట్‌పాత్‌ను ఢీకొట్టి ఎటూ కదలకుండా నిలబడిపోయింది. ఆ వెంటనే స్పందించిన రియెడ్ తన కారులోకి చేరి హ్యాండ్ గన్‌తో టికైల్‌ను నిలువరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు యజమానిగా చెప్పుకుంటున్న రియెడ్ ఓ దొంగని, సదరు టయోటా కారును ప్రిన్స్ జార్జ్ కౌంటీనుంచి అతడు దొంగిలించాడని గుర్తించారు. టికైల్, రియెడ్‌లను అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment