అల్లాదుర్గం రూరల్: మెదక్ జిల్లా అల్లాదుర్గం అంతా అప్రకటిత హై అలర్ట్...ఎక్కడి వారక్కడే అప్రమత్తమయ్యారు.. డబ్బులను జాగ్రత్తగా పెట్టుకున్నారు.. మహిళలు తమ నగలను భూమిలో పాతిపెట్టారు... ఎందుకిదంతా..? అల్లాదుర్గం పట్టణంలో దొంగలు సంచరిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారి ఆటకట్టించాలనుకున్న పోలీసులు గ్రామాల్లో చాటింపు వేయించారు. గ్రామాల్లో దొంగలు తిరుగుతున్నారని.. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
డబ్బు, నగలను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు. కొందరు మహిళలు తమ నగలను భూమిలో పాతిపెట్టారు. అయితే, ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే తాము దండోరా వేయిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.