పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు, స్వాధీనం చేసుకున్న రాగి వైరు
కర్ణాటక, కృష్ణరాజపురం : రెండేళ్లుగా తరచూ బెళ్లందూరు చెరువులో భారీగా మంటలు అంటుకుంటున్న ఘటనలకు సంబంధించి శుక్రవారం అసలైన కారణం వెలుగు చూసింది. బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకోవడానికి వెనుక చెరువులో పేరుకుంటున్న చెత్త, విషవాయువులు మాత్రమే కారణంగా ఇన్ని రోజులు భావిస్తూ వచ్చిన అధికారులు.. మంటలు అంటుకున్న ఘటనలకు తమిళనాడుకు చెందిన నలుగురు కేబుల్‌వైర్ల దొంగలు ప్రధాన కారణమని తెలుసుకొని అవాక్కయ్యారు. బెళ్లందూరు చెరువులో తరచూ మంటలు అంటుకుంటుండడంతో చెరువు చుట్టూ రక్షణ కోసం నియమించిన మార్షల్స్ ఎప్పటిలాగానే శుక్రవారం చెరువులో విధులు పాల్గొన్నారు.
బెళ్లందూరు చెరువులో మంటలు, పొగ (ఫైల్)
ఈ క్రమంలో చెరువులో చెట్ల మాటున నలుగురు వ్యక్తులు వైర్లకు నిప్పు పెడుతుండడాన్ని గమనించి వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అసలు విషయంవెలుగు చూసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన వైర్లను బెళ్లందూరు చెరువులో తగులబెట్టి లోపలున్న రాగి వైరును విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు తెలిపారు. చాలా ఏళ్లుగా తాము ఇక్కడే వైర్లను తగులబెడుతున్నామని గతంలో బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకున్న ఘటనలు తాము వైర్లకు నిప్పు పెట్టడం వల్లే జరిగాయంటూ అంగీకరించారు. తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment