Cable wires
-
వాలంటైన్స్‌డే రోజే ఢిల్లీలో దారుణం.. ప్రియురాలిని చంపి, ఫ్రిజ్‌లో దాచేసి..
న్యూఢిల్లీ: తనను ప్రేమించి మరో యువతిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసినందుకు ప్రాణంతీశాడో దుర్మార్గుడు. చంపేసి ఊళ్లోని తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్లో దాచాడు! రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్యోదంతం ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజే వెలుగు చూడటం గమనార్హం. ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్(24) గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనంలో ఉన్నాడు. 2018 జనవరిలో ఉత్తమ్ నగర్‌లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు, తర్వాత సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి సొంతూళ్లలో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. నిక్కీ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇటీవల గెహ్లాట్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్ ప్రియురాలికి చెప్పలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ అతడిని నిలదీసింది. మరొకరిని పెళ్లాడితే వేరే కేసులో ఇరికిస్తానని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో నిక్కీ అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను కారులో బయటకు తీసుకొచ్చాడు. అక్కడ కూడా పెళ్లి చేసుకోవద్దని ఆమె ఒత్తిడి చేసింది. అంతేగాక అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ముందే ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని అడగ్గా.. సాహిల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గెహ్లాట్ కారులో మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తన దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. దాబాలోని ఫ్రిజ్‌లో పెట్టి దానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అదే రోజు(ఫిబ్రవరి 10 ఉదయం) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు గెహ్లాట్‌ను ఢిల్లీ దగ్గర్లోని కయిర్ గ్రామంలో అరెస్ట్చేశామని పోలీస్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మృతదేహం రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభించిందని, ఆమె శరీరంపై గొంతు నులిమిన గుర్తులు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని ఇంకా ధృవీకరించబడలేదు. -
డిస్క్ంకు ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్ వైర్లు (ఇంటర్నెట్, డిష్)విద్యుత్ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ స్తంభాలు వివిధ రకాల కేబుల్ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభానికి మధ్య మైనస్ (ఎర్త్), ప్లస్ (పవర్ సప్లయ్)తో పాటు త్రీ ఫేజ్ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి. సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. జంక్షన్ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి. స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా బంద్ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్ బాక్సులకు పోల్స్‌పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్‌ను లాగి కరెంట్‌ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాయి. గ్రేటర్లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్‌లాస్ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు విద్యుత్ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్‌పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్‌పైకి కరెంట్ రివర్స్ సప్లయ్ జరిగి కార్మికులు విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు. (చదవండి: 19 డిపోలు లాభాలబాట) -
వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము
ఫిలిప్పీన్స్: ఎవరికైన పామును చూస్తే సహజంగానే భయం వేస్తుంది. ఎప్పడైన మనం పాములను ఆహారం కోసం వచ్చినప్పుడో లేక ఏదైన చెత్తచెదారాల్లోనో, పొదలుపొదలుగా ఉన్న గుబురు చెట్ట మధ్యలనో చూసి ఉంటాం. కానీ వీధిలో మాంచి రద్దీ రహదారిలో అది కూడా కేబుల్ వైర్లపై నుంచి పాము జారిపడటం ఎప్పుడైనా చూశారా . కానీ ఫిలిప్పీన్స్ నగరంలో ఈ ఘటనే చోటు చేసుకుంది. పైగా రాత్రి సమయంలో తగ్బిలారన్ సిటీలోని అత్యంత రద్దీగా ఉండే బోహోల్ మార్కెట్ వీధిలో ఓవెర్ హెడ్ వైర్లపై అతి పెద్ద పాము పాకుతూ కనిపిస్తుంది. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది) దీంతో అక్కడ నివాసితులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురువుతారు. అంతేకాదు కాసేపటి తర్వాత ఆ పాము రోడ్డు మీద పడిపోతుంది. ఈ మేరకు అక్కడ ఉన్న సదరు వ్యక్తులు ఆ పాముని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో నెటిజన్లు ఏంటో ఎక్కపడితే అక్కడ పాములు కనిపిస్తున్నాయి" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: "థింక్ బి ఫోర్ యూ డయల్") -
సినిమా స్టంటులా ప్రమాదం
-
సినిమా స్టంటులా ప్రమాదం
కృష్ణరాజపురం: ఆటో వద్ద నిలబడిన వ్యక్తి కేబుల్ వైర్ తగిలి సినిమా స్టంట్‌లో మాదిరిగా సుమారు 10 అడుగుల ఎత్తులో ఎగురుతూ వచ్చి ఫుట్‌పాత్‌పై నడిచి వెళ్తున్న మహిళపై పడ్డాడు. దీంతో మహిళ తలకు గాయాలు తగిలాయి. ఆ పడిన వ్యక్తి సురక్షితంగా వెళ్లిపోయాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురంలోని టీసీ.పాళ్యలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. వీడిన చిక్కుముడి ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరిగింది. సీసీ కెమెరాల వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాతో పాటు టీవీ చానెళ్లలో చక్కర్లు కొడుతోంది. కానీ ఇప్పటి వరకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందని పూర్తి వివరాలు తెలియలేదు. ఈ ప్రమాదంలో గాయపడింది తానే అని టీసీ పాళ్యలో నివాసం ఉంటున్న సునీత మీడియాకు చెప్పడంతో సంఘటన చిక్కుముడి వీడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం,తలకు గాయమైందని చెబుతున్న బాధితురాలు రెప్పపాటులో ప్రమాదం ఆమె 16వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఫుట్‌పాత్ మీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వెనుక ఆటో వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని కాళ్ల కింద పడి ఉన్న కేబుల్‌ను దూరంగా ఎవరో లాగడంతో కేబుల్‌తో పాటు ఆటో వద్దనున్న వ్యక్తి ఎగురుతూ వచ్చి ధబేల్‌మని మహిళ మీద పడ్డాడు. ఈ హఠాత్ ఘటనతో ఆమె భయపడిపోయింది. మహిళ కూడా కిందపడడంతో తల మీద గాయాలైనట్లు తెలిపింది. తన పైన పడిన వ్యక్తి ఎవరు, తరువాత ఏమయ్యాడు అనేది తెలియదని చెప్పింది. తనకు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి విచిత్ర ప్రమాదాలతో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోనని జనం ఆందోళన వ్యక్తం చేశారు. -
వార్నీ.. మంటలు మీ పనా?
కర్ణాటక, కృష్ణరాజపురం : రెండేళ్లుగా తరచూ బెళ్లందూరు చెరువులో భారీగా మంటలు అంటుకుంటున్న ఘటనలకు సంబంధించి శుక్రవారం అసలైన కారణం వెలుగు చూసింది. బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకోవడానికి వెనుక చెరువులో పేరుకుంటున్న చెత్త, విషవాయువులు మాత్రమే కారణంగా ఇన్ని రోజులు భావిస్తూ వచ్చిన అధికారులు.. మంటలు అంటుకున్న ఘటనలకు తమిళనాడుకు చెందిన నలుగురు కేబుల్‌వైర్ల దొంగలు ప్రధాన కారణమని తెలుసుకొని అవాక్కయ్యారు. బెళ్లందూరు చెరువులో తరచూ మంటలు అంటుకుంటుండడంతో చెరువు చుట్టూ రక్షణ కోసం నియమించిన మార్షల్స్ ఎప్పటిలాగానే శుక్రవారం చెరువులో విధులు పాల్గొన్నారు. బెళ్లందూరు చెరువులో మంటలు, పొగ (ఫైల్) ఈ క్రమంలో చెరువులో చెట్ల మాటున నలుగురు వ్యక్తులు వైర్లకు నిప్పు పెడుతుండడాన్ని గమనించి వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అసలు విషయంవెలుగు చూసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన వైర్లను బెళ్లందూరు చెరువులో తగులబెట్టి లోపలున్న రాగి వైరును విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు తెలిపారు. చాలా ఏళ్లుగా తాము ఇక్కడే వైర్లను తగులబెడుతున్నామని గతంలో బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకున్న ఘటనలు తాము వైర్లకు నిప్పు పెట్టడం వల్లే జరిగాయంటూ అంగీకరించారు. తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక రాజకీయ వ్యూహం
-
వ్యతిరేక మీడియాకు కత్తెర!
-
వ్యతిరేక మీడియాకు కత్తెర!
ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక రాజకీయ వ్యూహం ⇒ టీడీపీ నేతల కేబుల్ సంస్థలకు ఏజెన్సీలను కట్టబెడుతున్న ప్రభుత్వం ⇒ ఇతర కేబుల్ ఆపరేటర్ల వైర్లను తొలగించాలని ఆదేశాలు ⇒ పోలీసుల సహకారం కూడా తీసుకోవాలంటూ సూచన ⇒ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్ల నిలిపివేత ⇒ తద్వారా మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలనే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను నిలిపివేయాలన్నదే ప్రభుత్వ పెద్దల యోచనగా కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే కట్టబెడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇతరుల కేబుల్ సంస్థల రెక్కలను ప్రభుత్వం విరిచేస్తోంది. టీడీపీ నాయకుల సంస్థల వైర్లను తప్ప ఇతర సంస్థల వైర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించనుంది. అంటే అవి ఉనికిలో కూడా లేకుండా పోతాయి. అప్పుడు పెత్తనమంతా ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల ప్రైవేట్ కేబుల్ సంస్థలదే. ప్రభుత్వానికి నచ్చని చానళ్లను అవి నిలిపివేసే అవకాశం ఉంది. వాస్తవానికి మీడియాపై ప్రభుత్వాధినేత అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాపు ఉద్యమం సమయంలో వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ ప్రభుత్వాధినేత ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో ఏకంగా మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు వీలుగా ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. దీనిద్వారా వ్యతిరేక మీడియా ప్రసారాలు ప్రజలకు చేరకుండా అడ్డుచక్రం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబుల్ ఆపరేటర్ల వైర్ల ద్వారానే సేవలు ఫైబర్ గ్రిడ్ పథకం ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూర్చడంతోపాటు అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే కామధేనువుగా మారనుంది. ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే బాధ్యతను ప్రభుత్వం టీడీపీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే ప్రభుత్వం ఏజెన్సీల పేరిట కట్టబెడుతోంది. కర్నూలు జిల్లా కేంద్రంలో ఉపముఖ్యమంత్రి బంధువుల సంస్థకు అప్పగించారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి చెందిన కేబుల్ సంస్థకు ఏజెన్సీ దక్కింది. రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తామంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏజెన్సీని దక్కించుకున్న ప్రైవేట్ కేబుల్ సంస్థలు తమ కేబుల్ వైర్ల ద్వారానే వినియోగదారులకు ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం ఆయా ప్రైవేట్ సంస్థలకు రుసుములు చెల్లిస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాలు విద్యుత్ స్తంభాలపై ఫైబర్ గ్రిడ్ కేబుల్ వైరు తప్ప ఇతర వైర్లు వేలాడకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల కేబుల్ వైర్లు మాత్రమే ఉంటాయి. ఇతరుల కేబుల్ సంస్థల వైర్లను కత్తిరించేస్తారు. అంతిమంగా ఆ సంస్థలు మూతపడక తప్పదు. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. వైర్లను తొలగించేందుకు అవసరమైతే పోలీసు సిబ్బంది సహాయం కూడా తీసుకోవాలంటూ గతేడాది డిసెంబర్ 24న ఎస్పీడీసీఎల్ అధికారులు మెమో(2175/16) జారీ చేశారు. పోలీసుల సహాయం తీసుకొని మరీ తొలగించాలం టూ స్వయంగా సీఎం గతేడాది నవంబర్ 16న జరిగిన సమా వేశంలో ఆదేశాలిచ్చా రని ఈ మెమోలో స్పష్టం చేశారు. ఇకపై ఫైబర్ గ్రిడ్ మాటున అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ వైర్లు మాత్రమే విద్యుత్ స్తంభాలపై వేలాడనున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమల్లోకి రాగానే జనం తమకు నచ్చిన చానల్ చూసే అవకాశం కూడా ఉండదు. టీడీపీకి చెందిన ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేసే చానళ్లనే చూడాల్సి ఉంటుంది. సెట్ టాప్ బాక్స్ పేరుతో అదనపు భారం కేవలం రూ.149కే ఇంటర్నెట్ అని చెబుతున్న ప్రభుత్వం.. సెట్‌టాప్ బాక్స్ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది. కేవలం సెట్‌టాప్ బాక్స్ కోసం రూ.4,000 చెల్లించాలని చెబుతోంది. ఇప్పటికే ఉన్న సెట్‌టాప్ బాక్స్‌లపై కొత్త సర్వీసుకు అవకాశం లేదంటున్నారు. దీంతో ఇప్పటికే రూ.2,000 నుంచి రూ.2,500 వెచ్చించి కొనుగోలు చేసిన సెట్‌టాప్ బాక్సులు నిరుపయోగంగా మారనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగదా రులు నెలవారీ రూ.149ల బిల్లుతోపాటు అదనంగా పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఎక్కడా బయటపెట్టడం లేదు. ఏజెన్సీలు అధికార పార్టీ నేతలకే.. ► వాస్తవానికి ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వరంగ సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకే కట్టబెడుతున్నారు. ► శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్‌లకు అప్పగించారు. వీరిద్దరూ అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలో కొండల్రావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు అప్పగించారు. కొండల్రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్‌గా కొనసాగుతున్నారు. ► వైఎస్సార్ జిల్లా కడపలో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందిన జ్యోతి కేబుల్‌కు అప్పగించారు. ► అనంతపురం జిల్లా కేంద్రంతోపాటు రా ప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో మంత్రి పరిటాల సునీత తనయుడు ప రిటాల శ్రీరాంకు చెందిన సిటీ కేబుల్‌కు ఫైబర్‌గ్రిడ్ ఏజెన్సీని కట్టబెట్టారు. ► రాష్ట్రంలో కొన్నిచోట్ల మాత్రం మొదటి నుంచీ ఉన్న కేబుల్ సంస్థలకు కూడా పనులు అప్పగించారు. -
రిలయన్స్ టవర్‌లో అగ్నిప్రమాదం
మంచిర్యాల టౌన్(ఆదిలాబాద్ జిల్లా): మంచిర్యాల పట్టణంలోని రిలయన్స్ టవర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెళ్లిలో పేల్చిన తారాజువ్వలు రిలయన్స్ టవర్‌లోకి దూరి మంటలు చెలరేగాయి. కేబుళ్లకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
టెలిఫోన్ కార్యాలయాలే టార్గెట్
గండేపల్లి : టెలిఫోన్ కార్యాలయాలే లక్ష్యంగా కేబుల్ వైర్లను దొంగిలించి, అందులో రాగిని విక్రయించే ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపారకు చెందిన రూప శేషుబాబు, కంచర్ల సునీల్‌రాజా, అమ్మిశెట్టి బాలఫణీంద్ర కలిసి టెలిఫోన్ కార్యాలయాల్లో కేబుల్ వైర్లను దొంగిలించారు. అందులో రాగి తీగలను వేరుచేసి, విక్రయించారు. వీరికి పాత గుంటూరుకు చెందిన ఎస్కే మహమ్మద్ సహకరించాడు. గండేపల్లి టెలిఫోన్ కార్యాలయంలో గతేడాది అక్టోబర్‌లో ఈ ముఠా కేబుల్ వైర్లను దొంగిలించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నిందితులను నీలాద్రిరావుపేట వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. పలు జిల్లాల్లో 35 నేరాలు తూర్పుగోదావరిలో 24, పశ్చిమ గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, ప్రకాశం, విశాఖలో ఒకొక్క నేరానికి ఈ ముఠా పాల్పడింది. వీరి వద్ద నుంచి 610 కిలోల రాగి దిమ్మెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. నిందితులను పెద్దాపురం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై రజనీకుమార్, క్రైం సిబ్బంది బి.నరసింహరావు, పి.సత్యకుమార్, జీఎస్ఎన్ మూర్తికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు. -
గుంటూరు చానల్‌కు గండి
► నంబూరులో వంతెన నిర్మాణ పనుల వద్ద ఘటన ► గుంటూరు నగరానికి నెల రోజులు సరిపడా నీరు మురుగు చెరువుపాలు.. నంబూరు (పెదకాకాని) : నంబూరు వద్ద గుంటూరు చానల్ (కాలువ)కు గండి పడింది. మంగళవారం రాత్రంతా కృష్ణా నది నుంచి చానల్‌కు వచ్చిన నీరు గ్రామంలోకి చేరి మురుగు చెరువు పాలయ్యాయి. నంబూరు గ్రామంలోకి వెళ్లేందుకు గుంటూరు చానల్‌పై నిర్మించిన వంతెన దాటాల్సి ఉంటుంది. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వంతెన నిర్మాణం, రోడ్డు విస్తరణకు రూ.2 కోట్లు ఆర్డీఎస్ నిధులు మంజూరయ్యాయి. వాటిలో సుమారు రూ.76 లక్షలతో 24 రోజుల క్రితం కాంట్రాక్టర్ వంతెన నిర్మాణం పనులు ప్రారంభించారు. సుమారు 20 వేల మంది జనాభా ఉన్న గ్రామంలో వంతెన నిర్మించేటప్పుడు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ మొదట్లో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయకుండానే పనులు చేపట్టారు. ఈ విషయం వివాదంగా మారడంతో అస్తవ్యస్తంగా తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ప్రజలు ఈ పనులపై ప్రశ్నించిన ప్రతిసారీ పోలీసులను రప్పించి వెళ్లగొట్టడం, ఎవరైనా పనుల తీరుపై మాట్లాడితే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నీటి ప్రవాహంతో విద్యుత్ స్తంభం, కేబుల్ వైర్లు, పైపులైన్లకు దెబ్బ.. గుంటూరు చానల్‌పై వంతెన నిర్మాణం పనులతో కాలువ నీటిని పక్కకు మళ్లించారు. నాశిరకం పనులతో నీరు మళ్లించిన కాలువ కట్టకు గండి పడి నీరు గ్రామంలోని చెరువుకు చేరింది. కాలువ కట్ట కోతకు గురికావడంతో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైర్లు, పైపులైన్ దెబ్బతిన్నాయి. కాలువకు గండి పడటం వల్ల గ్రామంలోని చెరువులో సుమారు రూ.18 లక్షల విలువైన చేపలు చెల్లాచెదురయ్యాయని చేపల పెంపకందారుడు బట్టు శివరామకృష్ణ తెలిపారు.