మంచిర్యాల టౌన్(ఆదిలాబాద్ జిల్లా): మంచిర్యాల పట్టణంలోని రిలయన్స్ టవర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెళ్లిలో పేల్చిన తారాజువ్వలు రిలయన్స్ టవర్‌లోకి దూరి మంటలు చెలరేగాయి. కేబుళ్లకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.