A Huge Snake Hanging On Overhead Cables And After Falls On Ground - Sakshi
Sakshi News home page

Snake Hanging On Overhead Cables: వామ్మో...ఓవర్‌ హెడ్‌ వైర్ల పై పెద్ద పాము

Published Mon, Oct 18 2021 2:06 PM | Last Updated on Mon, Oct 18 2021 5:17 PM

A Huge Snake Hanging On Overhead Cables And After Falls On Ground - Sakshi

ఫిలిప్పీన్స్‌: ఎవరికైన పామును చూస్తే సహజంగానే భయం వేస్తుంది. ఎ‍ప్పడైన మనం పాములను ఆహారం కోసం వచ్చినప్పుడో లేక ఏదైన చెత్తచెదారాల్లోనో, పొదలుపొదలుగా ఉన్న గుబురు చెట్ట మధ్యలనో చూసి ఉంటాం. కానీ వీధిలో మాంచి రద్దీ రహదారిలో అది కూడా కేబుల్‌ వైర్లపై నుంచి పాము జారిపడటం ఎప్పుడైనా చూశారా . కానీ ఫిలిప్పీన్స్‌ నగరంలో  ఈ ఘటనే చోటు చేసుకుంది. పైగా రాత్రి సమయంలో తగ్బిలారన్ సిటీలోని అ‍త్యంత రద్దీగా ఉండే బోహోల్ మార్కెట్‌ వీధిలో ఓవెర్‌ హెడ్‌ వైర్లపై అతి పెద్ద  పాము పాకుతూ కనిపిస్తుంది.

(చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది)

దీంతో అక్కడ నివాసితులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురువుతారు. అంతేకాదు కాసేపటి తర్వాత ఆ పాము రోడ్డు మీద పడిపోతుంది. ఈ మేరకు అక్కడ ఉన్న సదరు వ్య‍క్తులు ఆ పాముని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌ చల్‌ చేస్తుంది. దీంతో నెటిజన్లు ఏంటో ఎక్కపడితే అక్కడ పాములు కనిపిస్తున్నాయి" అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. 

(చదవండి: "థింక్‌ బి ఫోర్ యూ డయల్")

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement