రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను నిలిపివేయాలన్నదే ప్రభుత్వ పెద్దల యోచనగా కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే కట్టబెడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇతరుల కేబుల్ సంస్థల రెక్కలను ప్రభుత్వం విరిచేస్తోంది. టీడీపీ నాయకుల సంస్థల వైర్లను తప్ప ఇతర సంస్థల వైర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించనుంది. అంటే అవి ఉనికిలో కూడా లేకుండా పోతాయి. అప్పుడు పెత్తనమంతా ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల ప్రైవేట్ కేబుల్ సంస్థలదే.