Fiber grid scheme
-
ఫైబర్ గ్రిడ్ అవినీతీపై విచారణ చేపడతాం
-
ఫైబర్ గ్రిడ్ పేరిట వందల కోట్ల అవినీతి
-
బ్లాక్‌లిస్ట్‌లోని వేమూరికి కాంట్రాక్టా?
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ గ్రిడ్ ఒక మాయ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రూ.149 రూపాయలకే కనెక్షన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఎక్కువ వసూలు చేసిందని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని, విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైబర్ గ్రిడ్‌ను చేపట్టిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌పై ఈవీఏం ట్యాంపరింగ్ కేసు ఉందని, అతను బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్‌ను అతనికి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఈ పథకం కింద నాసిరకం సెటప్ బాక్స్‌లు సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని కోరారు. దీనికి ఐటీ మంత్రి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని,బెంగుళూరులో రూ.1200కు ఇస్తున్న సెటప్ బాక్స్‌లను ఏపీలో రూ. నాలుగువేలకు ఇస్తున్నారని పేర్కొన్నారు. టెండర్ సమయంలో సెంటర్ విజిలెన్స్ గైడ్‌లైన్స్ కూడా పాటించలేదని తెలిపారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఈవిచారణలో అన్ని నిజాలు బయటపడతాయన్నారు. పోలవరం అంచనాలపై చర్చ రూ. 16వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఎలా పెంచారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శాసనమండలిలో ప్రశ్నించారు. ఈ అంశంపై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పోలవరంలో ఈపీసీ నుంచి 60సీకి ఇచ్చే అవకాశం లేదన్నారు.చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్వాసితులపట్ల కనీసం దృష్టి పెట్టలేదని విమర్శించారు. డ్యాం కడితే సరిపోదని, నిర్వాసితులను ఆదుకోవాలని, అది తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. పోలవరం కాపర్ డ్యాం పూర్తయితే.. 18వేల కుటుంబాలు ఇబ్బంది పడతాయని, కనీసం ఆ కుటుంబాలకు గత ప్రభుత్వం నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులు మొదలుపెడుతుందని వెల్లడించారు. పోలవరం కోసం తెచ్చిన ఏ మెటీరియల్ విషయంలోనూ ఆడిట్ చేయలేదని, పోలవరంలో జరిగిన అవకతవకలపై వారం రోజుల్లో సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నారు. పోలవరాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, దానిని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని జన్మలెత్తినా తెలుగుదేశం పార్టీ మాత్రం మరోసారి అధికారంలోకి రాదని అన్నారు. -
వినోదం బహుభారం
కంభం : అతి తక్కువ ధరకే మూరుమూల గ్రామాల్లో సైతం టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకం వినియోగదారులకు ఆశించినంత ప్రయోజనకరంగా లేదు. నెలవారీ చార్జీలు రూ.149 కే అని చెప్పినప్పటికీ వినియోగదారుల నుంచి జీఎస్టీ, బాక్స్ రెంటల్ అంటూ నెలకు రూ. 230 వసూలు చేస్తున్నారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. జిల్లాలో చాలా చోట్ల ఇంకా ఫైబర్ కనెక్షన్లు అందుబాటులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చినా తీసుకోడానికి ఆసక్తి కనబరచడం లేదు. జిల్లాలో సుమారు 2 నుంచి 3 లక్షల వరకు కేబుల్, ఇతర ప్రవేట్ కనెక్షన్లు ఉంటే ఏపీ ఫైబర్ కనెక్షన్లు 26 వేలు మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జిల్లాలో ఏపీ ఫైబర్ పై వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. నామమాత్రంగా సేవలు.. ఏపీ ఫైబర్ పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయినప్పటికి ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. కొందరు వినియోగదారులు తరచూ సెట్‌టాప్ బాక్సులు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు. టీవీ ఆన్ చేసిన ఐదు నిమిషాలకు ప్రోగ్రామ్స్ వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫైబర్‌లో నెట్ సౌకర్యం, ఫోన్ సౌకర్యం ఉన్నప్పటికి వాడాలంటే బయపడిపోతున్నారు. అర్థవీడు మండలంలో ఫోన్ వాడిన కొందరు వినియోగదారులకు వేలల్లో బిల్లులు వచ్చినట్లు తెలిసింది. దీంతో వినియోగదారులు నెట్, ఫోన్ వాడాలంటేనే బెంబేలెత్తుతున్నారు. నెలనెలా బిల్లులు రాక పోవడంతో బిల్లులు ఎంతొస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇంకా ఫైబర్ సేవలు ప్రారంభం కాలేదు. సబ్‌స్టేషన్‌లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కస్టమర్లకు లైన్లు లాగి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఒక ఓఎల్‌టీలో 120 కనె„ýక్షన్లు ఇవ్వడానికి వీలుపడుతుంది అదనంగా కనెక్షన్లు ఇవ్వాలంటే అదనంగా ఖర్చువస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతా ల్లో కనెక్షన్లు అడిగినా వారు ఇవ్వడం లేదు. ట్రాయ్ నిబంధనలతో అవస్థలు.. గతంలో రూ.150 నుంచి రూ.190 లోపే అన్ని రకాల చానల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉండేవి. ట్రాయ్ రూల్స్ వచ్చినప్పటి నుంచి ప్రజలు బిల్లులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అన్ని చానల్స్ చూడాలనుకున్న వారికి నెలకు రూ.320 వరకు ఖర్చు వస్తుంది. తెలుగు చానల్స్ బేసిక్ ప్లాన్‌తో టీవీలు చూడాలనుకున్న వారికి రూ.250 వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం వినియోగదారులు వారికి కావాల్సిన చానల్స్‌ను ముందుగానే ఎంచుకొని రీచార్చ్ చేసుకోవాలి. గతంలో ఈ పరిస్థితి లేదు నెలనెలా బిల్లులు కడితే సరిపోయేది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు రీచార్జ్ చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. వినియోగదారులు రీచార్జ్‌చేసుకోవడం లేదు గతంలో 199 రుపాయలకే అన్ని చానల్స్ వచ్చేవి ప్రస్తుతం 280 రుపాయలకు మించి కట్టాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులు రీచార్జ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వినియోగదారులు బిల్లులు కట్టలేమంటూ కనెక్షన్లు మానుకుంటున్నారు.– మున్నా, కేబుల్ నిర్వాహకుడు, కంభం బిల్లు ప్రతినెలా జనరేట్అవుతుంది.. ఏపీ ఫైబర్‌కు సంబం దించి వినియోగదారుల బిల్లు ప్రతినెల జనరేట్ అవుతుంది. కేబుల్ నిర్వహకులు కనెక్షన్లకు వెళ్లేందుకు ఆలస్యమవుతుందేమో వినియోగదారులు విచారించుకోవాలి. బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి.– చంద్రశేఖర్,ఏపీ ఫైబర్ జిల్లా మేనేజర్ -
ఇంటింటికి ఇంటర్నెట్
మహేశ్వరంర (రంగారెడ్డి): ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పనులు చేపట్టింది. ఈ ఫైబర్ గ్రిడ్ సేవలను ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం రూ.5వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకా న్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇంటింటికి ఇంటర్నెట్ నినాదం టీ ఫైబర్ గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశం. పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసింది. మహేశ్వరం, మన్సాన్పల్లి, తుమ్మలూ రు, సిరిగిరిపురం గ్రామాల్లో టీ ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం లైన్లు వేశారు. ఒక్కో గ్రామంలో సుమారు రూ.50 లక్షలతో పనులు చేపట్టి పూర్తిచేశారు. టెలిఫోన్, వైఫై, ఈ–హెల్త్ ఈ– ఎడ్యుకేషన్, ఈ– పంచాయతీ, పౌర సేవలు, మినీ థియేటర్స్, వీడియో కాన్ఫరెన్స్‌లు, మీసేవ కేంద్రాల ద్వారా అందే సేవలు, ట్రిపుల్ సర్వీస్‌లు (ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్, ల్యాండ్ లైన్ ఫోన్ సర్వీసులు), గ్రామంలో వీధి దీపాలను ఆటోమెటిక్ పద్ధతిలో వేయడం, ఆర్పడం వంటి సేవలను అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాల్లో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రులు, మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామంలో పది కనెక్షన్లు ఇచ్చారు.ఈ –హెల్త్ ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నారు. వైద్య సిబ్బంది వ్యక్తుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపర్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేవలు అందిస్తారు. అదేవిధంగా జనన, మరణ, ధ్రువీకరణ పత్రాలు సహా ఇతర ధ్రువీకరణ పత్రాలు 24 గంటల్లో ఇచ్చేలా మన్సాన్పల్లి గ్రామంలో సేవలను విస్తరించారు. రోగులు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో బీపీ, షుగర్ పరీక్షల వివరాలు సేకరిస్తారు. రోగులకు అవసరమయ్యే మందులను లైవ్‌లో చెబుతారు. ప్రజలను సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సులభతరం చేశారు. బటన్ నొక్కితే అధికారులు, ప్రజా ప్రతినిధులకు మెయిల్ వెళ్తుంది. వారు మెయిల్ చూసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ– ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం కోసం మినీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాలలకు డిజిటలైజేషన్ చేసి నాణ్యమైన విద్యను స్మార్ట్ క్లాస్‌ల ద్వారా విద్యార్థులకు అందిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పిస్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, సలహాలు, సూచనలు, పంటల సాగు, తెగుళ్ల నివారణకు మందుల, ఎరువుల వాడకం వివరాలు, నిత్యం రైతు బజార్లో కూరగాయాల ధరల వివరాలు అందించనుంది. వీధి దీపాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేసి పంచాయతీ కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. స్మార్ట్ వాయిస్, వీడియో కాన్ఫరెన్స్‌లు, వాతవరణం, ఉష్ణోగ్రతల వివరాలు, తాజా వార్తల అప్డెట్స్, అసెంబ్లీ సమావేశాలు, జీఓలు పలు అంశాలను తెలుసుకోవచ్చు. ఈ నాలుగు గ్రామాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా టీ ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. -
ఇంటింటికీ లేనెట్టేనా...
విజయనగరం గంటస్తంభం : ఇంటింటికీ ఇంటర్నెట్... టీవీ కేబుల్... టెలీఫోన్ వంటి సౌకర్యాలన్నీ ఒకే కనెక్షన్‌తో తక్కువ ధరకే ఇస్తామంటూ ఆర్భాటంగా చేసిన ప్రకటన జిల్లాలో తుస్సుమంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంటింటికీ ఫైబర్ గ్రిడ్ సేవలంటూ ఊదరగొట్టి మరికొన్ని నెలల్లో పాలన ముగుస్తోందనగా కేవలం 13శాతం గ్రామాలకు సేవలు చేరువ చేశారు. ప్రభుత్వం మాత్రం నవనిర్మాణ దీక్ష... జన్మభూమి... కార్యక్రమం ఏదైనా సభలు, సమావేశాల్లో అందరికీ ఫైబర్ గ్రిడ్ సేవలు అందినట్లే అధికారపార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడంతో ప్రజలు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గ్రామ పంచాయతీలు: 920 కల్పించిన గ్రామాలు: 1250 జిల్లాలోని గ్రామాలు: 1550 ఇంతవరకు ఫైబర్‌గ్రిడ్ సౌకర్యం జిల్లాలో ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల లక్ష్యం: 2.40లక్షలు జిల్లాలో ఇప్పటివరకు ఇచ్చిన కనెక్షన్లు: 15,00 నత్తనడకన కనెక్షన్లు రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఫైబర్‌గ్రిడ్ సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఏడాదిలోగా ఫైబర్ గ్రిడ్ సేవలు అన్ని గ్రామాలకు అందుబాటులోకి వస్తాయని రెండేళ్ళ క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించా రు. రూ.150లతో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తామని, టీవీ చూసుకచోవచ్చునని, ఫోన్ మాట్లాడుకోవచ్చునని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ సౌకర్యం మాత్రం అందలేదు. వాస్తవానికి ఫైబర్ గ్రిడ్ కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులతో అందు కు సంబంధించిన పరికరాలు సమకూర్చారు. ఇక సేవలు గ్రామాలు, అక్కడి నుంచి ఇళ్లకు అందించాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిది. అయితే ఈ పక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఫైబర్ గ్రిడ్ సేవలు అందరికీ విస్తరించడానికి జిల్లాలో అవసరమైన నెట్వర్కు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జిల్లాలో ఉన్న అన్ని విద్యు త్ సబ్స్టేషన్లలో వైర్ల ద్వారా పరికరాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి గ్రామాలకు వైర్ల ద్వారా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి ఇవ్వాలి. అయితే ఇంతవరకు 13శాతం గ్రామపంచాయతీలకు మాత్రమే కనెక్షను వెళ్లగా మొత్తం కుటుంబాల్లో 7.5శాతం కుటుంబాలకు కూడా కనెక్షను ఇవ్వలేకపోయారు. ఆసక్తి చూపని జనం... ఆపరేటర్లు ఫైబర్ గ్రిడ్ విస్తరించడపోడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఏడాదిలోగా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు దాటినా గ్రామాలకు కనెక్షను ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. మరోవైపు కనెక్షను పొం దేందుకు జనం కూడా ఆసక్తి చూపడం లేదు. ఒక కుటుంబం ఫైబర్ గ్రిడ్ సేవలు పొందాలంటే ఒకేసారి రూ.4వేలు ఖర్చవుతుంది. మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకపోయినా నెలానెలా చెల్లించాలి. అయితే ఇప్పటికే ప్రతి ఇం టికీ టీవీ కనెక్షన్ కేబుల్ ద్వారా పొందారు. ఇందు కు రూ.1500ల వరకు వెచ్చించి సెట్‌టాప్ బాక్సు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. కేబుల్ లేని వారు డిష్‌లు కొనుగోలు చేసుకున్నారు. జియో వంటి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట ర్నెట్, సెల్‌ఫోన్ ఛార్జింగ్ వంటివి ఈజీ అయ్యా యి. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న మూడు రకాల సేవలు ఇప్పటికే ఉన్న కుటుంబాలు ఫైబర్‌గ్రిడ్‌పై ఆసక్తి చూపడం లేదు. పోనీ అధిక ఛానల్స్, ఇతర సౌకర్యాలు కలుగుతాయని అంగీకరించినా నెలకు రూ.235లు చెల్లించాలి. ఇందులో రూ. 149 కనెక్షనుకు, రూ.50 సెట్‌టాప్ బాక్సుకోసం, 18శాతం జీఎస్టీ చెల్లించాలి. దీంతో జనం ఆసక్తి చూపకపోవడంతో ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సిన కేబుల్ అపరేటర్లు ముందుకు రావడం లేదు. గ్రామానికి ముందు కనెక్షను పొందాలంటే అపరేటరు సబ్‌స్టేషను నుంచి గ్రామానికి సరపడా కేబుల్ వైరు కొనుగోలు చేయాలి. గ్రామంలో పాయింట్ నుం చి ఇంటింటికి వారే వైరు కొనుగోలు చేసి వేయా లి. అంటే ఇందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాలి. కానీ వారికి నెలకు ఒక కనెక్షనుపై సుమా రు రూ.180 వస్తోంది. ఇప్పుడు ఎంఎస్‌వోలు కూడా కేబుల్ కనెక్షనుకు రూ.150 ఇస్తున్నారు. దీంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఎందుకు తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ఇంత ఖర్చు చేసిన తర్వాత జనం కనెక్షను తీసుకోకుంటే నష్ట మే. అందుకే వీరు వెనుకంజ వేస్తున్నారు. క్రమేపీ విస్తరిస్తాం జిల్లాలోని 22 మండలాల్లో పైబర్ గ్రిడ్ సేవలు విస్తరించాయి. గ్రామాల్లో అపరేటర్లు ముందుకు రాకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. గ్రామాల్లో ఇప్పటికే కేబుల్ వ్యవస్థ విస్తరించడం వల్ల కొంత సమస్య ఏర్పడింది. దీంతో అపరేరటర్లను చైతన్య పరుస్తున్నాం. క్రమేపీ ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు ఇచ్చేస్తాం. – జి.సీతారామ్, జిల్లా మేనేజర్, ఫైబర్‌గ్రిడ్ -
ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక రాజకీయ వ్యూహం
-
వ్యతిరేక మీడియాకు కత్తెర!
-
వ్యతిరేక మీడియాకు కత్తెర!
ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక రాజకీయ వ్యూహం ⇒ టీడీపీ నేతల కేబుల్ సంస్థలకు ఏజెన్సీలను కట్టబెడుతున్న ప్రభుత్వం ⇒ ఇతర కేబుల్ ఆపరేటర్ల వైర్లను తొలగించాలని ఆదేశాలు ⇒ పోలీసుల సహకారం కూడా తీసుకోవాలంటూ సూచన ⇒ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్ల నిలిపివేత ⇒ తద్వారా మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలనే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను నిలిపివేయాలన్నదే ప్రభుత్వ పెద్దల యోచనగా కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే కట్టబెడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇతరుల కేబుల్ సంస్థల రెక్కలను ప్రభుత్వం విరిచేస్తోంది. టీడీపీ నాయకుల సంస్థల వైర్లను తప్ప ఇతర సంస్థల వైర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించనుంది. అంటే అవి ఉనికిలో కూడా లేకుండా పోతాయి. అప్పుడు పెత్తనమంతా ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల ప్రైవేట్ కేబుల్ సంస్థలదే. ప్రభుత్వానికి నచ్చని చానళ్లను అవి నిలిపివేసే అవకాశం ఉంది. వాస్తవానికి మీడియాపై ప్రభుత్వాధినేత అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాపు ఉద్యమం సమయంలో వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ ప్రభుత్వాధినేత ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో ఏకంగా మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు వీలుగా ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. దీనిద్వారా వ్యతిరేక మీడియా ప్రసారాలు ప్రజలకు చేరకుండా అడ్డుచక్రం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబుల్ ఆపరేటర్ల వైర్ల ద్వారానే సేవలు ఫైబర్ గ్రిడ్ పథకం ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూర్చడంతోపాటు అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే కామధేనువుగా మారనుంది. ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే బాధ్యతను ప్రభుత్వం టీడీపీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే ప్రభుత్వం ఏజెన్సీల పేరిట కట్టబెడుతోంది. కర్నూలు జిల్లా కేంద్రంలో ఉపముఖ్యమంత్రి బంధువుల సంస్థకు అప్పగించారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి చెందిన కేబుల్ సంస్థకు ఏజెన్సీ దక్కింది. రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తామంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏజెన్సీని దక్కించుకున్న ప్రైవేట్ కేబుల్ సంస్థలు తమ కేబుల్ వైర్ల ద్వారానే వినియోగదారులకు ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం ఆయా ప్రైవేట్ సంస్థలకు రుసుములు చెల్లిస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాలు విద్యుత్ స్తంభాలపై ఫైబర్ గ్రిడ్ కేబుల్ వైరు తప్ప ఇతర వైర్లు వేలాడకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల కేబుల్ వైర్లు మాత్రమే ఉంటాయి. ఇతరుల కేబుల్ సంస్థల వైర్లను కత్తిరించేస్తారు. అంతిమంగా ఆ సంస్థలు మూతపడక తప్పదు. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. వైర్లను తొలగించేందుకు అవసరమైతే పోలీసు సిబ్బంది సహాయం కూడా తీసుకోవాలంటూ గతేడాది డిసెంబర్ 24న ఎస్పీడీసీఎల్ అధికారులు మెమో(2175/16) జారీ చేశారు. పోలీసుల సహాయం తీసుకొని మరీ తొలగించాలం టూ స్వయంగా సీఎం గతేడాది నవంబర్ 16న జరిగిన సమా వేశంలో ఆదేశాలిచ్చా రని ఈ మెమోలో స్పష్టం చేశారు. ఇకపై ఫైబర్ గ్రిడ్ మాటున అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ వైర్లు మాత్రమే విద్యుత్ స్తంభాలపై వేలాడనున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమల్లోకి రాగానే జనం తమకు నచ్చిన చానల్ చూసే అవకాశం కూడా ఉండదు. టీడీపీకి చెందిన ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేసే చానళ్లనే చూడాల్సి ఉంటుంది. సెట్ టాప్ బాక్స్ పేరుతో అదనపు భారం కేవలం రూ.149కే ఇంటర్నెట్ అని చెబుతున్న ప్రభుత్వం.. సెట్‌టాప్ బాక్స్ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది. కేవలం సెట్‌టాప్ బాక్స్ కోసం రూ.4,000 చెల్లించాలని చెబుతోంది. ఇప్పటికే ఉన్న సెట్‌టాప్ బాక్స్‌లపై కొత్త సర్వీసుకు అవకాశం లేదంటున్నారు. దీంతో ఇప్పటికే రూ.2,000 నుంచి రూ.2,500 వెచ్చించి కొనుగోలు చేసిన సెట్‌టాప్ బాక్సులు నిరుపయోగంగా మారనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగదా రులు నెలవారీ రూ.149ల బిల్లుతోపాటు అదనంగా పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఎక్కడా బయటపెట్టడం లేదు. ఏజెన్సీలు అధికార పార్టీ నేతలకే.. ► వాస్తవానికి ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వరంగ సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకే కట్టబెడుతున్నారు. ► శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్‌లకు అప్పగించారు. వీరిద్దరూ అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలో కొండల్రావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు అప్పగించారు. కొండల్రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్‌గా కొనసాగుతున్నారు. ► వైఎస్సార్ జిల్లా కడపలో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందిన జ్యోతి కేబుల్‌కు అప్పగించారు. ► అనంతపురం జిల్లా కేంద్రంతోపాటు రా ప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో మంత్రి పరిటాల సునీత తనయుడు ప రిటాల శ్రీరాంకు చెందిన సిటీ కేబుల్‌కు ఫైబర్‌గ్రిడ్ ఏజెన్సీని కట్టబెట్టారు. ► రాష్ట్రంలో కొన్నిచోట్ల మాత్రం మొదటి నుంచీ ఉన్న కేబుల్ సంస్థలకు కూడా పనులు అప్పగించారు.