
కలెక్టరేట్‌లో ఫైబర్‌గ్రిడ్ పరికరాలు
విజయనగరం గంటస్తంభం : ఇంటింటికీ ఇంటర్నెట్... టీవీ కేబుల్... టెలీఫోన్ వంటి సౌకర్యాలన్నీ ఒకే కనెక్షన్‌తో తక్కువ ధరకే ఇస్తామంటూ ఆర్భాటంగా చేసిన ప్రకటన జిల్లాలో తుస్సుమంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంటింటికీ ఫైబర్ గ్రిడ్ సేవలంటూ ఊదరగొట్టి మరికొన్ని నెలల్లో పాలన ముగుస్తోందనగా కేవలం 13శాతం గ్రామాలకు సేవలు చేరువ చేశారు. ప్రభుత్వం మాత్రం నవనిర్మాణ దీక్ష... జన్మభూమి... కార్యక్రమం ఏదైనా సభలు, సమావేశాల్లో అందరికీ ఫైబర్ గ్రిడ్ సేవలు అందినట్లే అధికారపార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడంతో ప్రజలు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో గ్రామ పంచాయతీలు: 920
కల్పించిన గ్రామాలు: 1250
జిల్లాలోని గ్రామాలు: 1550
ఇంతవరకు ఫైబర్‌గ్రిడ్ సౌకర్యం
జిల్లాలో ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల లక్ష్యం: 2.40లక్షలు- జిల్లాలో ఇప్పటివరకు ఇచ్చిన కనెక్షన్లు: 15,00
నత్తనడకన కనెక్షన్లు
రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఫైబర్‌గ్రిడ్ సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఏడాదిలోగా ఫైబర్ గ్రిడ్ సేవలు అన్ని గ్రామాలకు అందుబాటులోకి వస్తాయని రెండేళ్ళ క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించా రు. రూ.150లతో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తామని, టీవీ చూసుకచోవచ్చునని, ఫోన్ మాట్లాడుకోవచ్చునని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ సౌకర్యం మాత్రం అందలేదు. వాస్తవానికి ఫైబర్ గ్రిడ్ కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులతో అందు కు సంబంధించిన పరికరాలు సమకూర్చారు. ఇక సేవలు గ్రామాలు, అక్కడి నుంచి ఇళ్లకు అందించాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిది. అయితే ఈ పక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఫైబర్ గ్రిడ్ సేవలు అందరికీ విస్తరించడానికి జిల్లాలో అవసరమైన నెట్‌వర్కు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జిల్లాలో ఉన్న అన్ని విద్యు త్ సబ్‌స్టేషన్లలో వైర్ల ద్వారా పరికరాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి గ్రామాలకు వైర్ల ద్వారా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి ఇవ్వాలి. అయితే ఇంతవరకు 13శాతం గ్రామపంచాయతీలకు మాత్రమే కనెక్షను వెళ్లగా మొత్తం కుటుంబాల్లో 7.5శాతం కుటుంబాలకు కూడా కనెక్షను ఇవ్వలేకపోయారు.
ఆసక్తి చూపని జనం... ఆపరేటర్లు
ఫైబర్ గ్రిడ్ విస్తరించడపోడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఏడాదిలోగా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు దాటినా గ్రామాలకు కనెక్షను ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. మరోవైపు కనెక్షను పొం దేందుకు జనం కూడా ఆసక్తి చూపడం లేదు. ఒక కుటుంబం ఫైబర్ గ్రిడ్ సేవలు పొందాలంటే ఒకేసారి రూ.4వేలు ఖర్చవుతుంది. మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకపోయినా నెలానెలా చెల్లించాలి. అయితే ఇప్పటికే ప్రతి ఇం టికీ టీవీ కనెక్షన్ కేబుల్ ద్వారా పొందారు. ఇందు కు రూ.1500ల వరకు వెచ్చించి సెట్‌టాప్ బాక్సు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. కేబుల్ లేని వారు డిష్‌లు కొనుగోలు చేసుకున్నారు. జియో వంటి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట ర్నెట్, సెల్‌ఫోన్ ఛార్జింగ్ వంటివి ఈజీ అయ్యా యి. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న మూడు రకాల సేవలు ఇప్పటికే ఉన్న కుటుంబాలు ఫైబర్‌గ్రిడ్‌పై ఆసక్తి చూపడం లేదు. పోనీ అధిక ఛానల్స్, ఇతర సౌకర్యాలు కలుగుతాయని అంగీకరించినా నెలకు రూ.235లు చెల్లించాలి.
ఇందులో రూ. 149 కనెక్షనుకు, రూ.50 సెట్‌టాప్ బాక్సుకోసం, 18శాతం జీఎస్‌టీ చెల్లించాలి. దీంతో జనం ఆసక్తి చూపకపోవడంతో ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సిన కేబుల్ అపరేటర్లు ముందుకు రావడం లేదు. గ్రామానికి ముందు కనెక్షను పొందాలంటే అపరేటరు సబ్‌స్టేషను నుంచి గ్రామానికి సరపడా కేబుల్ వైరు కొనుగోలు చేయాలి. గ్రామంలో పాయింట్ నుం చి ఇంటింటికి వారే వైరు కొనుగోలు చేసి వేయా లి. అంటే ఇందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాలి. కానీ వారికి నెలకు ఒక కనెక్షనుపై సుమా రు రూ.180 వస్తోంది. ఇప్పుడు ఎంఎస్‌వోలు కూడా కేబుల్ కనెక్షనుకు రూ.150 ఇస్తున్నారు. దీంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఎందుకు తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ఇంత ఖర్చు చేసిన తర్వాత జనం కనెక్షను తీసుకోకుంటే నష్ట మే. అందుకే వీరు వెనుకంజ వేస్తున్నారు.
క్రమేపీ విస్తరిస్తాం
జిల్లాలోని 22 మండలాల్లో పైబర్ గ్రిడ్ సేవలు విస్తరించాయి. గ్రామాల్లో అపరేటర్లు ముందుకు రాకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. గ్రామాల్లో ఇప్పటికే కేబుల్ వ్యవస్థ విస్తరించడం వల్ల కొంత సమస్య ఏర్పడింది. దీంతో అపరేరటర్లను చైతన్య పరుస్తున్నాం. క్రమేపీ ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు ఇచ్చేస్తాం.
– జి.సీతారామ్, జిల్లా మేనేజర్, ఫైబర్‌గ్రిడ్
Comments
Please login to add a commentAdd a comment