పేదోడి సొంతింటి కలను నెరవర్చడమే నాధ్యేయం. పేదలందరూ కష్టపడి ఇంటికి వచ్చిన సమయంలో హాయిగా సేదతీర్చడానికి
విజయనగరం క్రైం: పేదోడి సొంతింటి కలను నెరవర్చడమే నాధ్యేయం. పేదలందరూ కష్టపడి ఇంటికి వచ్చిన సమయంలో హాయిగా సేదతీర్చడానికి ఒక ఇల్లు ఉం డాలి. గత ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి కేటాయించిన సొమ్ముకంటే అదనంగా కేటాయిస్తాం. ఇంటిని నిర్మించి పేదలకు అందిస్తాను. మీకు ఎటువంటి భయాందోళన వద్దని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉకదంపుడు ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకోవడానికి జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. వివిధ రకాల సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప పేదలకు ఇంటిని నిర్మించే బాధ్యతను మాత్రం చేపట్టక పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఏడాదికి జిల్లాలో సుమారు యాభై వేల వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు.
చేస్తున్న సర్వేలివి: గత ప్రభుత్వహయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చెప్పి వివిధ రకాల సర్వేలను నిర్వహించారు. సర్వేలకు నిర్వహించిన డబ్బులతో కొం తమందికైనా ఇళ్ల నిర్మాణం జరిగేదని నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని జిల్లావ్యాప్తంగా 83 టీంలను నియమించి సర్వేచేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఇంటికి సంబంధించిన ఫొటో తీశారు. ఫొటోల్లో పాత ఇళ్లనే చూపించే అవకాశం ఉందని, ఆపద్ధతిని నిలిపి వేసి మళ్లీ ఇంటి నిర్మాణంతో పాటు లబ్ధిదారుతో ఫొటో తీయాలని చెప్పి మరల రీ సర్వేచేశారు.
దీంతో పాటు నూతనంగా జియో ట్యాగ్ విధానం ద్వారా ఇళ్ల ఫొటోలను తీయాలని ముచ్చటగా మూడోసారి సర్వే చేశారు. అలాగే ప్రతి ఇంటికీ ఆధార్‌సీడింగ్ చేశారు. ఇలా ప్రభుత్వం సర్వేల పేరుతో తప్పించుకుంటోంది తప్ప పేదోడి కలను నిజంచేయడం లేదు. దీంతో ప్రభు త్వంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జిల్లాలో 2,75,280 ఇళ్లకు గాను 2,55,881 ఇళ్లను ఆధార్ సీడింగ్ చేశారు. జియోట్యాగ్ 2,75,280 ఇళ్లకుగాను 2,45,884ఇళ్లకు చేశారు. ఏడాదిలో ఇవే తప్ప ఇంకేమీచేయనిపరిస్థితి. అలాగే హుద్‌హుద్ తుపాను సమయంలో సుమారు 15వేలకు పైగా ఇళ్లు దెబ్బతింటే వాటికి కొత్త ఇళ్లు మంజూరు చేశారు తప్ప ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.