అనంతరం జోగి రమేష్ ఫైబర్ గ్రిడ్ పేరిట జరిగిన వందల కోట్ల అవినీతిని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తన అనుయయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందన్నారు. రూ.149లకే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ఇస్తామని ప్రచారం చేశారని, సెటాప్ బాక్స్‌లకు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు.