bellandur lake
-
హీరోయిన్ ఫోటోషూట్ : విశేష స్పందన
కర్ణాటక, కృష్ణరాజపురం : పర్యావరణ కాలుష్యంపై స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవా సంఘాలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో గాలి, నీరు, భూమి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ కోవలోనే బెంగళూరు నగరంలో అత్యంత పెద్ద చెరువైన బెళ్లందూరు చెరువు కూడా పాలకులు, ప్రజల సంయుక్త నిర్లక్ష్యానికి పూర్తిగా కలుషిత కోరల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో నీటి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రముఖ యువ హీరోయిన్ రష్మిక మందన్న బెళ్లందూరు చెరువు నీటిలో ఫోటోషూట్ చేయించుకున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డీ.సన్మతి నేతృత్వంలో బెళ్లందూరు చెరువు నీటి లోపల తీయించుకున్న ఫోటోలను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన రష్మిక ఫోటోలతో పాటు సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బెళ్లందూరు చెరువులో ఇటువంటి పరిస్థితి నెలకొందనే విషయం ఫోటోషూట్ చేయించుకునే వరకు తమకు తెలియలేదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఎంతో అందంగా ఉన్న బెళ్లందూరు చెరువులో ప్రస్తుతం నెలకొన్న కాలుష్యాన్ని చూసిన అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ రష్మిక తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చెరువుల్లోనూ బెళ్లందూరు చెరువులో నెలకొన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని అటువంటి చోట నేను ఉండదలచుకోవడం లేదని జల కాలుష్యంపై అవగాహన కల్పించడానికి బెళ్లందూరు చెరువులో ఫోటోషూట్ చేయించుకున్నట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ట్విట్టర్లో రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఫోటోలు, సందేశానికి అభిమానులు, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. -
‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు’
పెరుగుతున్న జనాభాతో పాటు మన దేశంలో కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. తినే తిండే, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతీది కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో గాలి కూడా విషమవడం చూస్తూనే ఉన్నాం. ఈ నగరాల చుట్టూ ఉన్న చెరువులు కాలుష్య కాసారాలు అవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఈ కాలుష్య భుతాన్ని మాత్రం అదుపు చేయలేకపోతుంది. అయితే సమస్యకు కారణమవుతోన్న మనుషుల్లో మార్పు రానవంత వరకూ.. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఇదే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు హీరోయిన్ రష్మిక మందన్న. నీటి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు రష్మిక. కర్ణాకటలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌లో ఫోటో షూట్ చేశారు. అనంతరం ఈ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘గొప్ప టీమ్‌తో కలిసి నీట కాలుష్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాను. బెల్లందూర్ చెరువు దగ్గరకు వచ్చి చూసే వరకూ దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ చెరువు ఎంత అందంగా ఉండేదో గుర్తొచ్చి నా గుండే బద్దలయ్యింది. ప్రతి చోట ఇలానే ఉంది. ఇలాంటి చోట ఉండాలని నేనైతే అనుకోను. మీతో పంచుకోవాలి అనిపించి చెబుతున్నా’ అంటూ రష్మిక ట్వీట్ చేశారు. Well wasn't aware of this till we had to actually go and shoot this in Bellandur lake..which like really broke my heart,and imagine few years down the line..it’s the same case everywhere else..😱 I’d rather not want to be in that space.. I just wanted to share 🤷 (2/2) pic.twitter.com/zshJLDwW6s — Rashmika Mandanna (@iamRashmika) December 13, 2018 అయితే కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత కలుషితమైన చెరువుగా బెళ్లందూర్ నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఈ చెరువు నుంచి మంటలు కూడా ఎగసి పడ్డాయి. -
వార్నీ.. మంటలు మీ పనా?
కర్ణాటక, కృష్ణరాజపురం : రెండేళ్లుగా తరచూ బెళ్లందూరు చెరువులో భారీగా మంటలు అంటుకుంటున్న ఘటనలకు సంబంధించి శుక్రవారం అసలైన కారణం వెలుగు చూసింది. బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకోవడానికి వెనుక చెరువులో పేరుకుంటున్న చెత్త, విషవాయువులు మాత్రమే కారణంగా ఇన్ని రోజులు భావిస్తూ వచ్చిన అధికారులు.. మంటలు అంటుకున్న ఘటనలకు తమిళనాడుకు చెందిన నలుగురు కేబుల్‌వైర్ల దొంగలు ప్రధాన కారణమని తెలుసుకొని అవాక్కయ్యారు. బెళ్లందూరు చెరువులో తరచూ మంటలు అంటుకుంటుండడంతో చెరువు చుట్టూ రక్షణ కోసం నియమించిన మార్షల్స్ ఎప్పటిలాగానే శుక్రవారం చెరువులో విధులు పాల్గొన్నారు. బెళ్లందూరు చెరువులో మంటలు, పొగ (ఫైల్) ఈ క్రమంలో చెరువులో చెట్ల మాటున నలుగురు వ్యక్తులు వైర్లకు నిప్పు పెడుతుండడాన్ని గమనించి వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అసలు విషయంవెలుగు చూసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన వైర్లను బెళ్లందూరు చెరువులో తగులబెట్టి లోపలున్న రాగి వైరును విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు తెలిపారు. చాలా ఏళ్లుగా తాము ఇక్కడే వైర్లను తగులబెడుతున్నామని గతంలో బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకున్న ఘటనలు తాము వైర్లకు నిప్పు పెట్టడం వల్లే జరిగాయంటూ అంగీకరించారు. తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బెంగళూరు సరస్సులో భారీ మంటలు
బెంగళూరు: ఇండియా సిలికాన్ వ్యాలీగా పేర్గాంచిన బెంగళూరులో తిరిగి గతంలో జరిగిన సంఘటన పునరావృతం అయింది. విపరీతంగా వ్యర్థాలు పడేయడంతోపాటు, జలాలన్నీ కూడా తీవ్ర కలుషితం కావడంతో మరోసారి బెల్లందూర్ సరస్సులో మంటలు చెలరేగాయి. అయితే, ఈసారి గతంలోకంటే కూడా నగర వాసులు భయపడేంత భయంకరంగా వ్యాపించాయి. దట్టమైన పొగలతో ఓ భారీ బాంబు దాడి జరిగితే ఎలాంటి పొగలు వస్తాయో అంతకుమించిన పొగలు ఆ సరస్సు నుంచి వెళువడుతుండటంతో నగర వాసులంతా వణికి పోతున్నారు. గురువారం సాయంత్రం చెలరేగిన మంటలు ఇప్పటికీ తగ్గకపోగా ఫైర్ సిబ్బందికి కూడా ఇబ్బందిని కలిగిస్తూ చుట్టుపక్కల ఉన్న ఎండుగడ్డిని అంటూకుంటూ తీవ్ర కలవరం పెట్టిస్తున్నాయి. సరస్సులో తీవ్ర కాలుష్యంతోపాటు ఈ సరస్సు ఒడ్డునే పడేస్తున్న వ్యర్థాలు, సరస్సు నీటిలో కలుస్తున్న రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇది నగరవాసులు తిరిగే పెద్ద పెద్ద రహదారుల పక్కనే ఉన్న కారణంగా ఆ పక్కగా వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులుపడటంతోపాటు వణికిపోతున్నారు. పెద్దఎత్తున వ్యాపించిన ఈ పొగల్లో దీర్ఘకాలంలో ఇబ్బందులు పెట్టే విషవాయువులు కూడా ఉండొచ్చని వారు ఆందోళనకు గురి అవుతున్నారు. బెంగళూరులో ఉన్న సరస్సుల్లో బెల్లందూర్, వర్తూర్‌లు అతి పెద్దవి. అయితే ఇవి చెత్త, పరిశ్రమల వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పరిశుభ్రం చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు వెళ్లడం లేదు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఏర్పడింది. దీనిపట్ల సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల నగర నిర్వాహక అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తిట్టి పోస్తున్నారు.