బైక్ దొంగల అరెస్టు
Published Fri, Oct 7 2016 11:01 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
నరసరావుపేట రూరల్: ద్విచక్రవాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన బత్తుల కిరణ్‌సాయి, బరంపేటకు చెందిన షేక్ మహాబూబ్‌సుభాని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ , రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడ్డారు. దీంతో పాటు నల్లపాడులో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తున్న మహిళ మెడలోని 3 సవర్ల బంగారాన్ని అపహరించారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, బంగారు గొలుసును స్వా«ధీనం చేసుకున్నారు. శుక్రవారం వీరిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చినట్టు రూరల్ ఎస్సై జెసిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Advertisement
Advertisement