హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఘరానా దొంగలను పోలీసులు ఆటకట్టించారు. పలు పోలీసు స్టేషన్‌ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముఠాలో ఉన్న నలుగురిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఇరవై తులాల బంగారం, మూడు కార్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివారలు ఇంకా తెలియరావాల్సి ఉంది.