ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం విఠలారం గ్రామంలో శుక్రవారం వేకువజామున దొంగలు చెలరేగి పోయారు. గణపవరం రాంప్రసాద్ అనే ప్రభుత్వ టీచర్ ఇంట్లో చొరబడి విలువైన వస్తువులు, పట్టుచీరలు దోచుకెళ్లారు. కుటుంబసభ్యులందరూ బెంగుళూరుకు వెళ్లగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు.
ఇంట్లో ఎవరూ లేనందున ఎంతమేర చోరీ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. అలాగే పక్కనే ఉన్న ఐదు పాన్ షాప్‌లలో కూడా దొంగలు తమ చోరకళను ప్రదర్శించారు. పాన్‌షాప్‌ల తాళాలు పగులగొట్టి అందులోని ఐటమ్స్, నగదు ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితులు ఏటూరునాగారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.